విశ్లేషణ: నిన్న నీరు, నేడు నిప్పు…

చంద్ర బాబుగారికి ఇటు నీరు, అటు నిప్పు ఊపిరాడనివ్వడంలేదు. `ఈ మహా పుష్కరాలు ఎప్పుడెప్పుడు పూర్తవుతాయా’ అని రోజులు లెక్కించుకనే పరిస్థితి ఏర్పడుతోంది. గోదావరికి 144 ఏళ్లకొకసారి వచ్చే మహాపుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణలో చంద్రబాబు ప్రతి క్షణం అప్రమత్తంగాఉన్నారు. అన్ని వ్యవహారాలు తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. అయినప్పటికీ, ఆదిలోనే హంసపాదులా తొలిరోజునే పుణ్యనదిలో స్నానమాచరించాలని వచ్చిన యాత్రికుల తొక్కిసలాట కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆయన తీవ్రంగా మనస్తాపం చెందారనే చెప్పాలి. దీనికి తోడు ప్రతిపక్షాలు తమ ఘాటైన వ్యాఖ్యలతో ఆయన్ని రాజకీయంగా ఇరుకన పెట్టాలని చూశాయి. అపార రాజకీయ అనుభవం, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునే మనోధైర్యం ఉండబట్టి ఆయన వాటిని పట్టించుకోకుండా తనదైన స్టైల్ లో సాగిపోయారు. తొక్కిసలాట సంఘటన అనంతర చర్యలను చాలా చురుగ్గా తీసుకున్నారనే చెప్పాలి. అలా ఆయన తీసుకున్న చర్యల్లో ముఖ్యమైన నిర్ణయం ఏమంటే రాజమండ్రిలోనే మకాం వేయడం. ఆనాటి నుంచి నిత్యం మహాపుష్కరాల ఏర్పాట్లను కంటికిరెప్పలా చూసుకుంటున్నారు. రాజధాని నిర్మాణ మాస్టర్ ప్లాన్ ని తీసుకువచ్చిన సింగపూర్ నిపుణులను కూడా రాజమండ్రికే రప్పించుకున్నారు. అక్కడే సమావేశం ఏర్పాటుచేశారు. ఈ విదేశీ నిపుణులు కూడా పుష్కరాల ఏర్పాట్లు చూసి మచ్చటపడ్డారు. అంతవరకూ కథ బాగానే ఉంది.
12రోజుల్లో 8 రోజులు గడిచిపోయి, 9వ రోజు కూడా అయిపోవస్తుందనగా ఉన్నట్టుండి మరో సంఘటన…. పుష్కరాల 9వ రోజైన బుధవారం సాయంత్రం రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న హోటల్ లో గ్యాస్ లీకవ్వడంతో మంటలు చెలరేగాయి. పుష్కర యాత్రికులతో బిజిబిజీగా ఉండేప్రాంతంలో ఇలా ఉన్నట్టుండి అగ్నికీలలు ఎగిసిపడటంతో జనం భయంతో పరుగులుతీశారు. విషయం తెలియగానే ముఖ్యమంత్రి హుటాహుటిన సంఘటన స్థలికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు. ఆస్తినష్టమే తప్ప ప్రాణనష్టం జరగలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించడంతో ప్రమాద తీవ్రత బాగా తగ్గిందనే చెప్పాలి.
అటు నీరు, ఇటు అగ్నిఇబ్బందులు పెట్టడంతో ముఖ్యమంత్రి తన అధికారులను ఇప్పుడు మరింత అప్రమత్తం చేస్తున్నారు. ఏ చిన్నసంఘట జరిగినా మీడియా, ప్రతిపక్షాలు భూతద్దంలో చూడటం నిద్రాహారాలను మాని పనులు చేస్తున్న వారిని చికాకుకలిగిస్తోంది. అయినప్పటికీ సహనం పాటిస్తూ మిగిలిన రోజులు లాక్కురావాలని శ్రమిస్తున్నారు.
తొక్కిసలాట జరిగిన తర్వాత చాలా మంది పుష్కర యాత్రికులు రాజమండ్రికి కాకుండా చుట్టుపక్కల చిన్నచిన్న ఊర్లలోనే పుష్కరస్నానాలు, ఇతర విధులను నిర్వహించుకున్నారు. అయినప్పటికీ రాజమండ్రి వెళ్ళే యాత్రికుల సంఖ్య తగ్గడంలేదు. ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేయడంతో పాటుగా, స్వచ్ఛంద సంస్థలు సహాయసహాకారాలు అందించడంతో పుష్కరాలు సజావుగానే సాగుతున్నాయి. అంతలో ఇప్పుడు చోటుచేసుకున్నఅగ్నిప్రమాదం బాబుని ఉలికిపాటుకు గురిచేసిందనే చెప్పాలి. ఈసారి కూడా ఆయన వెంటనే స్పందిస్తూ తగు చర్యలు తీసుకోవడం స్థానికులకూ, యాత్రికులకు కొంత ఊరట కలిగించే అంశమే.
యాత్రికులు లక్షల సంఖ్యలో రోజూ వస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ అగ్నిప్రమాదఘటన హెచ్చరిస్తోంది.
– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close