ఎట్టకేలకు చింతమనేనికి బెయిల్..!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం జైలు నుంచి విడుదల కానున్నారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లా జైల్లో ఉన్నారు. చింతమనేని మొదటగా సెప్టెంబర్ 11వ తేదీన అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి.. బయటకు రాకుండా పోలీసులు కేసుల మీద కేసులు పెడుతున్నారు. అన్నీ ఒకే సారి కాకుండా.. ఒక కేసులో రిమాండ్ పూర్తయితే.. బెయిల్ వస్తుందని క్లారిటీ వస్తే.. ఆ వెంటనే.. మరో కేసు పెట్టి.. పీటీ వారెంట్‌పై మరోసారి అరెస్ట్ చూపిస్తున్నారు.

దీంతో ఇప్పటి వరకూ.. దాదాపుగా ఇరవైకిపైగా కేసులు పెట్టారు. చింతమనేనిని నారా లోకేష్ సహా. టీడీపీ ముఖ్యనేతంలదరూ పరామర్శించారు. ఇప్పటికీ.. వారానికొకరు చొప్పున జైలుకి వెళ్లి చింతమనేనికి ధైర్యం చెప్పి వచ్చారు. ఇంటికి వెళ్లి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులతో వేధించేవారికి వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చివరికి రెండు నెలల తర్వాత కోర్టు అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసింది. శనివారం చింతమనేని విడుదల కానున్నారు.

వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత.. టీడీపీ నేతలు చాలా మందిపై కేసులు పెట్టారు కానీ.. చింతమనేనిని మాత్రం.. డెడ్లీగా టార్గెట్ చేశారు. స్వయంగా ఎస్పీనే.. చింతమనేని ప్రభాకర్ పై . ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని పిలుపునిచ్చారు. దీంతో.. వైసీపీ నేతలు.. ఒక్కొక్కర్ని తీసుకొచ్చి ఫిర్యాదులిప్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇతర కేసుల్లో అయితే అరెస్ట్ చూపడం సాధ్యం కాదు కాబట్టి. స్టేషన్ బెయిల్ కు అవకాశం లేని ఎస్సీ, ఎస్టీ కేసులే ఎక్కువగా నమోదు చేశారని చింతమనేని అనుచరులు ఆరోపణలు గుప్పించారు. ఎట్టకేలకు చింతమనేని విడుదలవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close