ఆ టాపిక్ మాట్లాడొద్దు, ఆర్టీసీపై వెన‌క్కి త‌గ్గొద్ద‌ని దిశానిర్దేశం!

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రంతో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఎంపీల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు తెరాస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. కేంద్రాన్ని ఏయే అంశాల‌పై నిల‌దీయ్యాలో ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. కేంద్రాన్ని కొన్ని అంశాల‌పై గ‌ట్టిగా నిల‌దియ్యాల‌నీ, ముఖ్యంగా విభ‌జ‌న చ‌ట్టంలోని పెండింగ్ అంశాల అమలుకు ప‌ట్టుబ‌ట్టాల‌ని కేటీఆర్ చెప్పారు. బ‌య్యారం ఉక్కు ఫ్యాక్ట‌రీ, గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం, ఖాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ… వీటిపై కేంద్రాన్ని పార్ల‌మెంట్లో నిల‌దీయ్యాల‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ‌ల‌కు నిధులు ఇవ్వాలంటూ డిమాండ్ చెయ్యాల‌న్నారు. వీటితోపాటు కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ ప‌ట్టుబ‌ట్టాల‌న్నారు.

అయితే, ఇదే కాళేశ్వ‌రం అంశ‌మై జాతీయ హోదా ఇవ్వొద్దంటూ ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన‌ అంశం మీద కేటీఆర్ చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. దీనిపై పార్ల‌మెంటులో మాట్లాడొద్ద‌నీ, ఇత‌ర ఎంపీలు ఎవ‌రైనా కావాల‌ని లేవ‌నెత్తినా దీనిపై మౌనంగా ఉండాలంటూ ఎంపీల‌కు కేటీఆర్ సూచించిన‌ట్టు తెలుస్తోంది! ఇది చాలా సున్నిత‌మైన అంశ‌మ‌నీ, దీన్ని పార్టీ చూసుకుంటుంద‌నీ ఎవ్వ‌రూ నోరు జారొద్ద‌ని కేటీఆర్ గట్టిగానే చెప్పార‌ట‌! దీంతోపాటు, ఆర్టీసీ స‌మ్మె అంశం పార్ల‌మెంటులో చ‌ర్చ‌కు వ‌స్తే ఎలా తిప్పికొట్టాల‌నేది కూడా స‌భ్యుల‌కు ఆయ‌న దిశానిర్దేశం చేశారు.

ఈ స‌మావేశాల్లో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె అంశం కూడా ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. భాజ‌పా ఎంపీలు దీన్ని ప్ర‌ధానాంశంగా లేవ‌నెత్తి, సీఎం కేసీఆర్ తీరును ఎండ‌గ‌డ‌తారు. కార్మికుల స‌మ‌స్య‌ల్ని పార్ల‌మెంటు స్థాయికి తీసుకెళ్లామ‌ని, కేసీఆర్ వైఖ‌రిని దేశ‌వ్యాప్తంగా చాటిచెప్పామ‌నే ప్ర‌చారం భాజ‌పాకి రాజ‌కీయంగా అవ‌స‌రం క‌దా! భాజ‌పాతోపాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా స‌మ్మె అంశ‌మై ప్ర‌స్థావిస్తారు. కాబ‌ట్టి, తెరాస ఎంపీల‌పై స‌మ్మె సెగ స‌భ‌లో త‌గిలే అవ‌కాశం ఉంటుంది. అలాంటి సంద‌ర్భం వ‌స్తే, కేంద్రం తీసుకొచ్చిన మోటారు వాహ‌నాల చ‌ట్టాన్ని స‌భ‌లో ప్ర‌స్థావించాలనీ, ప్రైవేటీక‌ర‌ణ అంశం అందులో ఉంద‌ని బ‌లంగా తిప్పికొట్టాలంటూ స‌భ్యుల‌కు కేటీఆర్ చెప్పారని తెలుస్తోంది. కేంద్ర చ‌ట్టాన్ని ప్ర‌స్థావిస్తే భాజ‌పాకి తిరిగి మాట్లాడే అవ‌కాశం ఉండ‌దు అనేది తెరాస వ్యూహం. మొత్తానికి, ఈసారి పార్ల‌మెంటు స‌మావేశాల‌కు ఇలా ఎంపీల‌ను ప్రిపేర్ చేయాల్సి వ‌చ్చింది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రొమాంటిక్ రాధేశ్యామ్‌

జాన్‌- రాధేశ్యామ్‌.. ఈ రెండింటిటో ప్ర‌భాస్ టైటిల్ ఏమిట‌న్న ఉత్కంఠ‌త‌కు తెర ప‌డింది. చిత్ర‌బృందం రాధే శ్యామ్‌పైనే మొగ్గు చూపించింది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల...

స్మగ్లర్‌ స్వప్నా సురేష్.. కేరళను కుదిపేస్తోంది..!

స్వప్నా సురేష్... ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం...

నర్సాపురం ఎంపీ ఇక లేఖలు ఆపేస్తారా..?

రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన... వైసీపీ ఒక అడుగు వేస్తే.. ఆయన రెండు అడుగులు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తూ వస్తున్నారు....

దూబే హతం..! బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే ఆన్సర్..!

యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను.. యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అతనిని కాపాడేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. మరో విమర్శకు తావివ్వకుండా...యూపీ శివార్లలోనే ఎన్‌కౌంటర్ చేసేశారు. డీఎస్పీ...

HOT NEWS

[X] Close
[X] Close