అరెస్ట్ కాకుండానే అందరికీ బెయిల్..! కిడ్నాప్ కేసులో రాజీ అయిపోయిందా..?

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసుగా ప్రాచుర్యం పొందిన .. సీఎం కేసీఆర్ బంధువులు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసు మెల్లగా తేలిపోతోంది. మొదట్లో ఏ-2గా చెప్పి.. ఆ తర్వాతి రోజే ఏ-1గా మార్చి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత.. పాత్రధారులంటూ మరికొంత మందిని అరెస్ట్ చూపించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన వారుగా పోలీసులు చెబుతూ వస్తున్న అఖిలప్రియ భర్త భార్గవరామ్, ఆయన సోదరుడు.. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డితో పాటు కిడ్నాప్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ప్రచారం జరిగిన గుంటూరు శ్రీను అనేవ్యక్తిని కూడా పట్టుకోలేకపోయారు.

వీరందరూ దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లయ్ చేశారు. అక్కడ నిరాశ ఎదురవడంతో హైకోర్టుకు వెళ్లారు. వారందరికీ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్రాకుండా చేయడానికి తెలంగాణ పోలీసులు పెద్దగా ప్రయత్నించలేదు. నిజానికి ఇలా తప్పించుకుని తిరుగుతున్న వారిని అరెస్ట్ చేయలేకపోవడం పోలీసుల వైఫల్యం. కేసు బయటపడినప్పుడు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ దాదాపుగా ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెట్టి… కిడ్నాప్ వ్యవహారాన్ని కథలు కథలుగా చెప్పేవారు. మ్యాప్‌లు కూడా ప్రదర్శించేవారు. గుంటూరు శ్రీను, భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి వంటి వారిని పట్టుకోవడం.. పది టీములు.. ఇరవై టీముల్ని పెట్టామని చెబుతూ ఉండేవారు. ఫలానా చోట ఉన్నారని వెళ్తే జస్ట్ మిస్ అయ్యారని మీడియాకు లీకులు ఇచ్చేవారు.

ఎన్ని చేసినా చివరికి ఎవరినీ పట్టుకోలేకపోయారు. ఈ నిర్లక్ష్యంతోనే వారికి బెయిల్ రావడానికి మార్గం ఏర్పడింది. అయితే పోలీసులే కావాలని నిర్లక్ష్యం ప్రదర్శించారన్న అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ రావు, అఖిల ప్రియ మధ్య ఉన్నది భూ వివాదం.. ఆ విషయంలో పెద్దలు జోక్యం చేసుకుని సెటిల్ చేశారన్న అభిప్రాయం.. వ్యక్తమవుతోంది. అందుకే పోలీసులు కూడా ఈ కేసుపై ప్రస్తుతం ఎలాంటి ఆసక్తి వ్యక్తం చెయడం లేదని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close