ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం గోవిందప్పకు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయనను అధికారులు విజయవాడ జైలుకు తరలిస్తున్నారు.
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో జగన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయిన బాలాజీ గోవిందప్ప క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ స్కామ్ ద్వారా అందిన ముడుపులను డొల్ల కంపెనీలకు మళ్లించిన దాంట్లో గోవిందప్ప పాత్ర ఉందని సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది.
అరెస్ట్ చేస్తారని భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళారు గోవిందప్ప. పక్కా సమాచారంతో మైసూర్ లో గోవిందప్పను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు..బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. దీంతో ఆయనకు ఈ నెల 20వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది.