బాల‌కృష్ణ‌.. అనిల్‌ రావిపూడి.. సినిమా ఎలా ఉంటుందంటే?

టాలీవుడ్ లో మ‌రో ఆస‌క్తి క‌ర‌మైన కాంబినేష‌న్ సెట్ అయ్యింది.. అదే నంద‌మూరి బాల‌కృష్ణ – అనిల్ రావిపూడిల‌ది. ఎఫ్ 3 త‌ర‌వాత‌.. అనిల్ రావిపూడి చేయ‌బోయే సినిమా ఇదే. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేస్తున్నాడు బాల‌య్య‌. అది అవ్వ‌గానే… అనిల్ సినిమాని ప‌ట్టాలెక్కించేస్తాడు. ఈ కాంబో ఎలా ఉండ‌బోతోంది? ఎలాంటి సినిమా రాబోతోంది..? బాల‌య్య కోసం అనిల్ ఎలాంటి క‌థ సిద్ధం చేశాడు? అంటూ అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బాల‌య్య సినిమా గురించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన క‌బుర్లు చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.

”నాది ప‌క్కా ఎంట‌ర్‌టైన‌ర్ జోన‌ర్‌. అయితే… బాల‌య్య‌తో సినిమా ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ సినిమా. నా త‌ర‌హా కామెడీ ఉంటుంది కానీ.. అక్క‌డ‌క్క‌డ మాత్ర‌మే ఉంటుంది. బాల‌య్య ఓ వ‌ప‌ర్ ఫ్యాక్టరీ. దానికి త‌గిన క‌థే సిద్ధం చేశా. న‌న్ను… నాతో పాటుగా బాల‌య్య‌ని కూడా ఈ సినిమాలో కొత్త‌గా చూస్తారు. మాస్ ఎలివేష‌న్లు, యాక్ష‌న్ సీన్లు.. అన్నీ ఉంటాయి. కానీ.. కొత్త స్థాయిలో…” అంటూ అభిమానుల్ని ఇప్ప‌టి నుంచే ఊరించ‌డం మొద‌లెట్టేశాడు అనిల్ రావిపూడి. సెప్టెంబ‌రు నుంచి… బాల‌య్య సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంద‌ట‌. ఈలోగా స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిలో “కట్టిన గ్రాఫిక్స్” అద్దెక్కిస్తున్న జగన్ సర్కార్ !

అమరావతి భూముల్ని వేలం వేయడమే కాదు ఇప్పుడు అక్కడ కట్టిన భవనాలను కూడా అద్దెకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీఆర్డీఏ ప్రతిపాదించింది. సీఎం జగన్ ఆమోదించేశారు. అమరావతిలో...

ఏపీలో ధియేటర్లు మూతబడతాయా !?

ఆన్‌లైన్ టిక్కెట్లు, సినిమాల కలెక్షన్లను గుప్పిట పెట్టుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ కావట్లేదు. తమ ఆదాయాన్నంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టి.. ప్రభుత్వం ఇచ్చే దాని కోసం వెయిట్ చేయడం కన్నా ...

ఏపీలో మోడీ బహిరంగసభ లేనట్లే !

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన బీజేపీ నేతలు.. ఓ బహిరంగసభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పది లక్షల మందిని సమీకరిస్తామని బీజేపీ నేతలు...

లక్ష మెజార్టీ రాలే.. లక్ష ఓట్లొచ్చాయ్ !

ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ తెచ్చుకోవాలని తాపత్రయపడిన వైసీపీకి లక్ష ఓట్లే రావడంతో ఆ ఆశ నెరవేరలేదు. పోలింగ్ శాతం బాగా పడిపోవడంతో... పోలైన ఓట్లలో లక్ష వైసీపీకి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close