రేవంత్ .. “రెడ్డి భజన” ఉపయోగమేనా !?

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో కులం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన అందర్నీ దువ్వుతున్నారు. మనమేంది.. మన చరిత్రేంది.. అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చారిత్రక అంశాలను కూడా చెబుతూ.. రెడ్డి పాలకులు లేకపోవడం వల్ల కష్టాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది. టీ పీసీసీ అధ్యక్షుడికి ఇంత కులపిచ్చ ఎందుకని కొంత మంది విమర్శిస్తూంటే… వ్యూహాత్మకంగా రెడ్డి సామాజికవర్గాన్ని పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చడమే కాకుండా… వెలమల పెత్తనం ఏమిటన్న అభిప్రాయం కల్పిస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు.

రాజకీయాల్లో కులం పాత్రను ఎవరూ కాదనలేరు. ప్రతి రాజకీయ పార్టీకి ఓటు బ్యాంక్‌గా కొన్ని కులాలు ఉంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రెడ్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం కారణంగా రెడ్ల యువత కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గింది. ఇప్పుడు మూలాలను బలపరుచుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సామాజికవర్గాలను తెరపైకి తెస్తున్నారు. సహజంగా వెలమ సామాజికవర్గం దొరలు. వారి తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. ఓపెన్‌గా కులాల గురించి మాట్లాడుతున్నారు.

అన్ని బేరీజు వేసుకునే రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని.. విమర్శలు వస్తాయని ఆయన తగ్గే రకం కాదని అంటున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి… కుల సమీకరణాలు చేపట్టడానికి అంతర్గత ప్రయత్నాల కన్నా బహిరంగ ప్రయత్నాలే ఎక్కువ చేస్తున్నారు. బీజేపీ మతం పేరుతో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్‌కు తెలంగాణ వాదం ఎలాగూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సామాజిక కోణంతో రాజకీయం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close