ఎన్నిక‌ల రిజ‌ల్ట్‌ని బ‌ట్టే.. బోయ‌పాటి క‌థ‌?!

నంద‌మూరి బాలకృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను డ‌బుల్ హ్యాట్రిక్ కి రంగం సిద్ధ‌మైంది. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్‌, అఖండ ఒక‌దాన్ని మించిన విజ‌యాలు అందుకొన్నాయి. ఇప్పుడు నాలుగో సారి జ‌ట్టు క‌డుతున్నారు. జూన్ 10 బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. అంద‌రూ అనుకొంటున్న‌ట్టు ఇది ‘అఖండ 2’ కాక‌పోవొచ్చు. ఎందుకంటే… బాల‌య్య కోసం బోయ‌పాటి ఓ పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థ‌ని రెడీ చేశాడు. ఈ రెండు క‌థ‌లూ బాల‌య్య‌కు వినిపించాడు. ‘అఖండ 2’ కంటే… ఈ యాక్ష‌న్ డ్రామానే బాల‌య్య‌కు బాగా న‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

అయితే.. ఒక్క‌టే ఇబ్బంది. ఏపీలో ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ హీట్ న‌డుస్తోంది. ఎన్నిక‌లు అయ్యాక‌… మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి చేరుకొంటుంది. అలాంటి త‌రుణంలో పొలిటిక‌ల్ సినిమాలు తీసినా అంత‌గా కిక్ ఇవ్వ‌క‌పోవొచ్చు. ఎన్నిక‌ల ముందైతే, పొలిటిక‌ల్ డ్రామా ప‌ర్‌ఫెక్ట్ గా సెట్ అయ్యేది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచి, అధికారం చేప‌డితే… పొలిటిక‌ల్ డ్రామా క‌థ‌ని బాల‌య్య ప‌క్క‌న పెట్టేస్తాడు. అప్పుడు `అఖండ 2` క‌థ‌ని ఎంచుకొంటాడు. బాల‌య్య ఏ క‌థ చేయాలి? అనేది ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని బ‌ట్టి డిసైడ్ అవుతుంది. మ‌రోవైపు బోయ‌పాటి కూడా రెండు క‌థ‌ల్ని ప‌క్కాగా సిద్ధం చేసుకొన్నాడు. బాల‌య్య ఏ క‌థకి ఓకే చెప్పినా… బోయ‌పాటి సిద్ధ‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close