వెంకీ.. ‘సోలో’గానే వ‌స్తున్నాడు!

వెంక‌టేష్ సినిమా అంటే ఈమ‌ధ్య మ‌ల్టీస్టార‌రే అనే ఫీలింగ్ వ‌చ్చేస్తోంది. ఆయ‌న మ‌రో హీరోతో క‌లిసి తెర పంచుకోవ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ త‌ర‌హా క‌థ‌లు వ‌ర్క‌వుట్ అవుతున్నాయి కూడా. ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలే అందుకు ఉదాహ‌ర‌ణ‌. అనిల్ రావిపూడితో ఇప్పుడు వెంకీ మ‌రో సినిమా చేస్తున్నాడు. ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ అనే మంచి టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులోనూ వెంకీతో పాటు మ‌రో హీరో ఉంటాడన్న వార్త‌లు ఊపందుకొంటున్నాయి. ఓ కీల‌క‌మైన పాత్ర‌లో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ న‌టిస్తాడంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే అంద‌రూ అనుకొంటున్న‌ట్టు ఇది మ‌ల్టీస్టార‌ర్ కాదు. సోలో హీరో సినిమానే. అందులో ఎలాంటి డౌటూ అక్క‌ర్లెద్దు. క‌థ ప్ర‌కారం ఇద్ద‌రు హీరోయిన్ల‌కు చోటుంది. ఓ క‌థానాయిక‌గా మీనాక్షి చౌద‌రి ఎంపిక ఖాయ‌మైంది. మ‌రో నాయిక కోసం అన్వేషిస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. సొంతూరు, స్నేహితులు… వీటి ప్రాధాన్య‌త చెప్పే క‌థ ఇది. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌ల‌వుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close