బాల‌య్య‌తో శ్రుతిహాస‌న్‌?

ద‌ర్శ‌కుల‌కు సెంటిమెంట్లు ఉంటాయి. హిట్ ఫార్ములాను వాళ్లు రిపీట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. వీలైనంత వ‌ర‌కూ.. హిట్ కాంబినేష‌న్ల‌ని వ‌దిలిపెట్ట‌రు. గోపీచంద్ మ‌లినేనికీ.. ఓ సెంటిమెంట్ ఏర్ప‌డింది. శ్రుతి హాస‌న్ రూపంలో. బ‌లుపు సినిమాతో గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడిగా అవ‌తారం ఎత్తాడు. ఆసినిమా హిట్టు. ఆ సినిమాలోనే శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. మొన్న‌టికి మొన్న `క్రాక్‌` కోసం కూడా…. శ్రుతిని ఏరి కోరి ఎంచుకున్నాడు. ఆసినిమా కూడా హిట్టే. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు గోపీచంద్‌. అందుకు త‌గిన క‌థ రెడీ అవుతోంది.

ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. పోలీస్‌గా, ఫ్యాక్ష‌నిస్టుగా బాల‌య్య క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. రెండు పాత్ర‌లు కాబ‌ట్టి.. మినిమం ఇద్ద‌రు హీరోయిన్లు ఉండాల్సిందే. ఇప్ప‌టికే ఓ హీరోయిన్ గా శ్రుతిని ఎంపిక చేసేశాడ‌ని తెలుస్తోంది. బాల‌య్య – శ్రుతిహాస‌న్ కాంబినేష‌న్ కొత్త‌గానే ఉంటుంది కాబ‌ట్టి, బాల‌య్య వైపు నుంచి కూడా అభ్యంత‌రాలు లేక‌పోవొచ్చు. మ‌రి రెండో క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది తేలాల్సివుంది. ఇటీవ‌ల `వ‌కీల్ సాబ్`లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌క్క‌న న‌టించింది శ్రుతి. అందులో మ‌రీ పీల‌గా క‌నిపించింది. ఆసినిమా హిట్ట‌యినా.. శ్రుతికి ఎలాంటి క్రెడిట్ ద‌క్క‌లేదు. పైగా.. మైన‌స్ అనే ముద్ర వేసుకొచ్చింది. ఇప్పుడు బాల‌య్య సినిమా కోస‌మైనా త‌న అవ‌తారం మార్చుకుంటుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని...

HOT NEWS

[X] Close
[X] Close