విశ్వ‌క్‌సేన్ కోసం బాల‌య్య‌

నంద‌మూరి హీరోలంటే విశ్వ‌క్‌సేన్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఎన్టీఆర్‌కు విశ్వ‌క్ వీరాభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ ప్ర‌స్తావన వ‌చ్చినా, ఊగిపోతాడు. బాల‌కృష్ణ‌తో కూడా మంచి అనుబంధ‌మే ఉంది. విశ్వ‌క్‌సేన్ గ‌త చిత్రానికి ఎన్టీఆర్ గెస్ట్ గా వ‌చ్చి ఆశీర్వ‌దించాడు. ఇప్పుడు బాల‌కృష్ణ వంతు వ‌చ్చింది. విశ్వ‌క్ కొత్త సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’. ఈనెల 31న విడుద‌ల కానుంది. సోమ‌వారం హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయ‌నున్నారు.

ఈ సినిమాపై విశ్వ‌క్ చాలా న‌మ్మ‌కాలు పెట్టుకొన్నాడు. ట్రైల‌ర్, టీజ‌ర్ అంచ‌నాల్ని పెంచేలా ఉన్నాయి. ”టీజ‌ర్‌, ట్రైయిల‌ర్‌లో చూపించింది కొంతే. సినిమాలో చాలా ఉంది. ఈమధ్య థియేట‌ర్లు బోసిబోయాయి. అక్క‌డ‌క్క‌డ మూసేశారు. ఈ సినిమాతో మ‌ళ్లీ థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌తాయి. చ‌రిత్ర‌లో మిగిలిపోతుందంతే” అంటూ త‌న అభిమానుల్ని ఊరిస్తున్నాడు విశ్వ‌క్‌. సినిమా టైమింగ్ కూడా బాగానే కుదిరింది. రేప‌టితో ఐపీఎల్ ముచ్చ‌ట అయిపోతుంది కాబ‌ట్టి, యువ‌త‌రం ఇప్పుడు థియేట‌ర్ల వైపు చూసే అవ‌కాశం ఉంది. వాళ్ల‌కు న‌చ్చే ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్న‌ట్టు ట్రైల‌ర్‌లోనే అర్థ‌మైపోతోంది. సో.. విశ్వ‌క్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అవ్వ‌బోతున్న‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : ఓడిపోయినప్పుడే ఈవీఎంలు గుర్తు రావడం అసలు రోగం !

ఈవీఎంలపై భారత రాజకీయ పార్టీల్లో ఎవరికీ నమ్మకం లేదు. చివరికి బీజేపీ, కాంగ్రెస్ కు కూడా లేదు. కానీ వారి అభిప్రాయాలు ఫలితాలు వచ్చినప్పుడల్లా మారిపోతూండటంతోనే సమస్య వస్తోంది. గెలిచిన...

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డి..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్ గా నియమించాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలన...

12 క‌థ‌లు రిజెక్ట్ చేసిన మెగా హీరో!

కెరీర్ ముందు నుంచీ క‌థ‌నే న‌మ్ముకొని ప్ర‌యాణం చేస్తున్న మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌. ఈ క్ర‌మంలో కొన్ని ప్ర‌యోగాలూ చేశాడు. ఎదురు దెబ్బ‌లూ తిన్నాడు. గ‌ని, గాంఢీవ‌ధారి అర్జున‌, ఆప‌రేష‌న్ వాలెంటైన్ వ‌రుణ్...

బ్యాన‌ర్‌ని న‌మ్ముకొని న‌లిగిపోతున్న ద‌ర్శ‌కుడు

తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన ద‌ర్శ‌కుడు...అనుదీప్‌. 'జాతిర‌త్నాలు' సినిమాతో కామెడీలో ఓ ట్రెండ్ సృష్టించాడు. 'ప్రిన్స్' కూడా త‌న మార్క్ వినోదాన్ని పంచి పెట్టింది. అయితే ఆ త‌ర‌వాత త‌న నుంచి మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close