బాలయ్యను సార్ అంటే.. కోప్పడతాడట..!

నందమూరి నట సింహం బాలకృష్ణ ఎంతటి స్టార్ హీరోనో అందరికి తెలిసిందే.. నందమూరి నట వారసత్వాన్ని తన భుజస్కంధాల మీద మోస్తూ నందమూరి నట కౌశల్యాన్ని కాపాడుతూ వచ్చిన ఆయన అటు రాజకీయంలో కూడా అంతే ఇన్వాల్వ్ మెంట్ తో ముందుకెళ్తున్నారు. అయితే బాలయ్య సెట్స్ లో ఎలా ఉంటాడు స్టార్ హీరోగానా.. ఎమ్మెల్యేగానా.. ఇలా చాలా డౌట్స్ ఉంటాయ్.. తెర మీద ఉగ్రనరసింహుడిలా కనిపించే బాలయ్య తెర వెనుక ఎలా ఉంటాడు. సెట్స్ మీద బాలయ్య బాబు ఎలాంటి ప్రవర్తనతో ఉంటాడు అన్నది కనుక్కోవాలని కుతూహలంగా ఉండేది నందమూరి అభిమానులకు.

అయితే అదే విషయాన్ని చెప్పుకొచ్చింది డిక్టేటర్ లో మెరుపులా మెరిసిన చిన్నది అక్ష. బాలయ్యతో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న అమ్మడు బాలయ్య ఓ స్టార్ హీరోగా కాకుండా చాలా కోపరేటివ్ గా ఉంటారని అంటుంది. అంతేకాదు బాలయ్యను మొదటిసారి సార్ అని పిలిస్తే.. అలా పిలిచే ఉద్దేశం ఉంటే తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నారని చెప్పింది. ముద్దుగా బాల అని పిలవమని చెప్పాడట.

సాటి కళాకారులకు విలువ ఇవ్వడంతో పాటుగా వారితో పెద్ద చిన్నా అనే తేడాలేకుండా ప్రవర్తించడం బాలయ్యకే చెందిందేమో.. ప్రస్తుతం డిక్టేటర్ హిట్ తో ఫుల్ ఖుషీలో ఉన్న బాలయ్య తన 100వ సినిమా ‘ఆదిత్య 369’కు సీక్వెల్ గా ‘ఆదిత్య 999’ చేస్తానని అంటున్నాడు. అంతేకాదు ఆ సినిమాతో తన వారసుడు మోక్షజ్నను కూడా తెరంగేట్రం చేసే ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వకీల్ సాబ్… వర్క్ మొద‌లైంది

క‌రోనా ఎఫెక్ట్, లాక్ డౌన్‌ల వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కూ ఆటంకం ఏర్ప‌డింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ధైర్యం చేస్తున్నాయి. వీలైనంత వ‌ర‌కూ సినిమాని సిద్ధం చేసే ప్ర‌య‌త్నాల్లో...

ఓటీటీలో రాజ‌మౌళి శిష్యుడి సినిమా

రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'ఆకాశ‌వాణి'. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ధారి. ఈ సినిమా ఓ వెరైటీ కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంది. నోరు లేని రేడియో... ఓ భ‌యంక‌ర‌మైన విల‌న్ పై...

పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన కేసులు కూడా ఎత్తేస్తారా..!?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు రాను రాను వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే దళితులపై పోలీసుల అరాచకాలు హైలెట్ అవుతూండగా.. తాజాగా..పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసుల్ని కొట్టి విధ్వంసం సృష్టించిన కేసులను కూడా... ఎత్తేయాలని నిర్ణయించుకోవడం...

వైఎస్-చంద్రబాబు స్నేహంపై దేవాకట్టాకు కాపీరైట్ ఉందా..!?

నిర్మాత విష్ణు ఇందూరి - దర్శకుడు దేవా కట్ట మధ్య నాలుగు రోజుల కిందట.. సోషల్ మీడియాలో ప్రారంభమైన... వైఎస్ - చంద్రబాబు స్నేహం కథపై సినిమా వివాదం టీవీ చానళ్లకు ఎక్కింది....

HOT NEWS

[X] Close
[X] Close