జీ మోడీజీ…మా సంగతి ఏమిటి?

ఇదివరకు ఎన్నికలకు రెండు మూడు నెలల ముందే హడావుడి మొదలయ్యేది కానీ ఇప్పుడు ఏకంగా ఏడాది ముందే మొదలయిపోతున్నాయి. బహుశః దానినే లాంగ్ టర్మ్ ప్లానని సరిపెట్టుకోవాలేమో? బిహార్ ఎన్నికలకి కూడా మన మోడీజీ అలాగే ప్రిపేర్ అయిపోయి ఒకటీ కాదు…రెండూ కాదు..ఏకంగా 1.25 లక్షల కోట్లని గ్రాంట్ చేసి పడేశారు. అది చూసి చంద్రబాబు షాక్ అయిపోయారు.

“ఇన్ని నెలలుగా విమానాలు అరిగిపోయేలా డిల్లీ చుట్టూ తిరుగుతూ మోడీకి ముందో జీ వెనకో జీ తగిలించి జీ..మోడీజీ…అంటూ వెన్నుపూసవిరిగిపోయేలా వినయంతో వంగి వంగి మాట్లాడుతున్నా మోడీజీ హ్యాండ్స్ షేక్ చేస్తారు..కలిసి ఫోటోలు దిగుతారు..ఇంకా కావాలంటే డిల్లీ నుంచి గుప్పెడు మట్టి..చెంబుడు నీళ్ళు కూడా తెచ్చి ఇచ్చేరు తప్ప హోదాలు ప్యాకేజీలు గురించి నోరు విప్పరు. కానీ బిహార్ జనాలను మంచి చేసుకోవడానికి డబ్బును పల్లీబటాణీలు పంచినట్లు పంచిపెట్టేస్తామని మైకులు బ్రద్దలు అయిపోయేలా గట్టిగా చెపుతుంటారు..”అని నాయుడుగారు బాధ పడుతుంటే మరో నాయుడుగారు వచ్చి ప్రాస తప్పకుండా ఓదార్చుతుంటారు.

“కానీ వ్రతం చెడినా ఫలం దక్కలేదు కదా భలే శాస్తి జరిగిందిలే..”అని తెలుగు అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ చాలా సంతోషపడ్డారని మీడియాలో ఒకటే పుకార్లు…ఊహాగానాలు వినిపించేయి.

బిహార్ లో లాలూ, నితీష్ చేతిలో తిన్న కంకు దెబ్బల నొప్పి తగ్గడానికి మోడీజీ…అమిత్ షాజీ ఒకరికొకరు చాలా రోజులు జండూ బామ్ లు రాసుకోవలసివచ్చింది కూడా. అయినా అమిత్ షాకి ఇంకా ఆ నొప్పులు తగ్గినట్లు లేదు అందుకేనేమో చాలా రోజులుగా ‘సైలెంట్ మోడ్’ లో ఉంటున్నారు.

మోడీజీ మళ్ళీ తేరుకొని చూసేసరికి చెన్నైలో వరదలు కనపడ్డాయి. మరిక క్షణం ఆలస్యం చేయకుండా ఇస్పెషల్ ప్లేన్ కట్టిన్చేసుకొని హడావుడిగా చెన్నైలో జయలలిత ముందు వాలిపోయారు. ఆమె బోకే అందించకమునుపే మోడీజీ ఆమెకు బోలెడు సానుభూతి, దానితో బాటే రకరకాల ప్యాకేజీలు ఆమె చేతిలో పెట్టి చక్కా వచ్చేరు. ఆ తరువాత జల్లికట్టుకి అనుమతి కావాలని ఆమె అడగగానే వెంటనే ఉత్తర్వులు జారీ చేసేసి ‘పండగ చేసుకోమన్నారు. అప్పుడే అందరికీ గుర్తుకు వచ్చింది ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్నాయి కదా..అని. కానీ సుప్రీం కోర్టుకి ఈ ఎన్నికలు..రాజకీయాలను పట్టించుకొనే అలవాటు బొత్తిగా లేకపోవడంతో జల్లికట్టుకి ‘నో’ చెప్పేసింది. దానితో మళ్ళీ తమిళ తంభిలు అందరూ మోడీజీ మీద కోప్పడిపోయారు.

ఏమిటో వ్రతం చెడినా ఫలితం మాత్రం దక్కడం లేదు అని మోడీజీ ఒక నిట్టూర్పు విడిచి ఊరుకొంటే, ఏపీలో బాబుగారు మాత్రం కోర్టులు వద్దన్నా సంక్రాంతికి కోడి పందేలు..జల్లికట్టు అన్నిటినీ నిర్విఘ్నంగా..తెదేపా గౌరవం ఇనుమడించేలా చాలా అట్టహాసంగా జరిపించేసి చూసి చూడనట్లు ఊరుకొన్నారు. “ఈ మోడీజీని అసలు అర్ధం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను ఎంత వంగి వంగి వినయంగా ప్రాదేయపడుతున్నా బొత్తిగా పట్టించుకోడు..కానీ అమ్మ దయ కోసం…మహబూబా ముఫ్తీ దయ కోసం…మమతక్క కటాక్షం కోసం ఎప్పుడూ ప్రాకులాడుతుంటాడు,” అని చంద్రబాబు నాయుడు ఒక పద్ధతి ప్రకారం మనసులోనే బాధ పడుతుంటారు.

కానీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికలు వస్తున్నాయనే సంగతి మళ్ళీ గుర్తుకు రావడంతో “మళ్ళీ మన రాష్ట్రానికి ఎన్నికలు వచ్చేవరకు హోదా కోసం, ప్యాకేజీ కోసం..ఇంకా చాలా వాటి కోసం…ఎదురు చూడకతప్పదేమో…” అని మనసుకి సర్దిచెప్పుకోవడం అలవాటు చేసేసుకొన్నారు బాబుగారు ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఇదివరకులా ఆయన హోదా, ప్యాకేజీ, మెట్రో రైలు, రైల్వే జోను, పోలవరం అంటూ ప్రతీదానికి హర్ట్ అయిపోవడం లేదు. నిజం చెప్పుకోవాలంటే ఇప్పుడు అసలు వాటి గురించి అడగడం కూడా మానేశారు.

ఎప్పుడూ విదేశాలలోనే తిరిగే మోడీజీ ఎప్పుడయినా దేశంలో ఏదయినా రాష్ట్రానికి వెళితే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నట్లేనని జనాలు కూడా తీర్మానించేశారు. మోడీజీ మళ్ళీ నిన్నఅస్సాంలో కనబడేసరికి అందరికీ అదే డౌట్ వచ్చేసి అస్సాం ఎన్నికల క్యాలెండర్ తిరగేసి చూస్తే వచ్చే ఏడాది జనవరిలోనే ముహూర్తం ఉన్నట్లు తేలింది. కనుక ఊరక రారు మోడీజీ అని అందరూ సర్ది చెప్పుకొన్నారు. అయితే ఈసారి అస్సాం వెళ్ళినప్పుడు ప్యాకేజీల గురించి మాట్లాడకపోవడంతో అక్కడి ప్రజలు కూడా ఆంధ్రా ప్రజల్లాగే బాగా హర్ట్ అయిపోయారుట. మనకి మోడీజీ చాలా ప్రేమతో డిల్లీ నుండి చెంబుడు నీళ్ళు..గుప్పెడు మట్టి తెచ్చి ఇచ్చేరు…పాపం అస్సాం జనాలకి అదీ ఇవ్వలేదు…కనుక మోడీజీ ఖచ్చితంగా మనకే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు లెక్క అని అందరం తృప్తి పడిపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close