హీరోయిన్‌.. టైటిల్ రెడీ.. కానీ చెప్ప‌ర‌ట‌

బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రెడీ అవుతోంది. క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది ఇంకా ఫైనల్ అవ్వ‌లేదు. బ‌య‌ట చాలా పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే వారెవ‌రూ కాద‌ని…. చిత్ర‌బృందం క్లారిటీ ఇచ్చేసింది. “హీరోయిన్ గురించి మీడియాలో చాలా చ‌ర్చ జ‌రుగుతోంది. చాలా పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ వాళ్లెవ‌రూ కాదు. ఈ సినిమాలో ఒక‌రే హీరోయిన్. ఇప్ప‌టికే ఇద్ద‌రిని ఫైన‌ల్ చేశాం. వాళ్ల‌లో ఒక‌రిని త్వ‌ర‌లోనే ఖ‌రారు చేస్తాం. టైటిల్ కూడా రెడీనే. కానీ.. ఇప్పుడే చెప్పం. ప‌రిస్థితులు బాలేవు. హీరోయిన్ పేరు, టైటిల్ మంచి రోజు చూసుకుని ప్ర‌క‌టిస్తాం“ అని బోయ‌పాటి శ్రీ‌ను తెలిపారు. ఈ చిత్రంలో బాల‌య్య పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. అఘోరాగానూ ఆయ‌న క‌నిపించ‌నున్నారు. బాల‌కృష్ణ పుట్టిన రోజున విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. అందులో బాల‌య్య గెట‌ప్ కూడా అభిమానుల్ని ఆక‌ట్టుకుంది. అఘోరాగా బాల‌య్య ఎలా ఉంటాడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ పోలీసుల పనితీరు రాష్ట్రపతి భవన్‌ వరకూ వెళ్లింది..!

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బ్యాడ్ టైం కొనసాగుతోంది. వరుసగా సీబీఐ విచారణలకు తోడు... రాజకీయ కారణాలతో ప్రాథమిక హక్కులను హరిస్తున్నారన్న ఫిర్యాదులు రాష్ట్రభవన్ వరకూ వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ప్రసాద్...

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...

HOT NEWS

[X] Close
[X] Close