అడ్వాన్సులు తిరిగిచ్చేయండి ప్లీజ్‌: నిర్మాత‌ల విన్న‌పాలు

క‌రోనా వ‌ల్ల టాలీవుడ్ మొత్తం త‌ల‌కిందులైంది. షూటింగులు ఆగిపోయాయి. థియేటర్లు మూత‌బ‌డ్డాయి. సినిమాలు రెడీ అయినా.. విడుద‌ల చేసుకోలేని ప‌రిస్థితి. కార్మికుల‌కు ఉపాథి లేకుండా పోయింది. ఇవ‌న్నీ పైన క‌నిపిస్తున్న క‌ష్టాలు. లోలోప‌ల ఇంకా చాలా స‌మ‌స్య‌లున్నాయి.

మార్చిలోనే క‌రోనా ఉధృతి ఎక్కువైంది. అప్పుడే షూటింగులు ఆపేశారు. కొత్త సినిమాల విడుద‌ల‌లూ వాయిదా ప‌డ్డాయి. క‌థ‌లు సిద్ధం చేసుకుని, షూటింగులు మొద‌లెడ‌దామ‌ని భావించిన సినిమాలు.. కొబ్బ‌రి కాయ కొట్ట‌కుండానే ఆగిపోయాయి. అలాంటి సినిమాలు చిన్న‌, పెద్ద క‌లిపి క‌నీసం 25 నుంచి 30 వ‌ర‌కూ ఉంటాయి. షూటింగులుమొద‌లు కాక‌పోవ‌డం వ‌ల్ల‌…. వీటికొచ్చిన న‌ష్ట‌మేమీ లేద‌నుకుంటే పొర‌పాటే. ఆయా నిర్మాత‌లంతా న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కూ అడ్వాన్సులు ఇచ్చేసుకున్నారు. చిన్న సినిమాలైతే ఫ‌ర్వాలేదు. మీడియం సైజు, భారీ సినిమాల‌తే అడ్వాన్సులే కోట్ల‌లో ఉంటాయి. అడ్వాన్సులు ఇచ్చేసిన నిర్మాత‌లంతా ఇప్పుడు గంద‌ర‌గోళ ప‌రిస్థితిలో ఉన్నారు. షూటింగులు మొద‌లెట్ట‌లేదు కాబ‌ట్టి, ఆ అడ్వాన్సుల్ని తిరిగి తీసుకోవాలా? లేదంటే ఇంకొంత కాలం వేచి చూడాలా? అనేది వాళ్ల‌కు అర్థం కావ‌డం లేదు.

ప‌రిస్థితుల్ని చూస్తే.. మొద‌లెట్టిన షూటింగులే స‌వ్యంగా న‌డ‌వ‌లేని న‌డ‌వ‌లేని స్థితి. సినిమాల్ని ఎందుకు మొద‌లెట్టాం రా బాబూ… అంటూ నిర్మాత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అందుకే… ఇంకా మొద‌ల‌వ్వ‌ని సినిమాల్ని, స్క్రిప్టు ద‌శ‌లోనే ఆపేయాల‌నిచాలామంది నిర్మాత‌లు భావిస్తున్నారు. అందుకే… ఇప్పుడు ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయ‌మ‌ని హీరోలు, ద‌ర్శ‌కుల‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప‌రిస్థితులు బాగాలేవ‌ని, సినిమాల్ని తీసే స్థితిలో లేమ‌ని హీరోల‌కు క‌న్వెన్స్‌చేసుకుంటున్నారు. అయితే.. కొంత‌మంది మాత్రం బ్యాన‌ర్ వాల్యూ ఎక్క‌డ దెబ్బ తింటుందో అని… అడ్వాన్సులు అడ‌గ‌డానికి మొహ‌మాట ప‌డుతున్నారు. ఒక‌రిద్ద‌రు నిర్మాత‌లు ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని నిర్మాత‌ల మండ‌లిలో పంచాయితీ పెట్టిన‌ట్టు స‌మాచారం. ఫ‌లానా హీరోనో, ఫ‌లానా ద‌ర్శ‌కుడో.. అడ్వాన్సు తిరిగి ఇవ్వ‌డం లేద‌ని – ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తానికి చాలా సినిమాలు ఇప్పుడు.. స్క్రిప్టు ద‌శ‌లోనే ఆపేయ‌డానికి నిర్మాత‌లు ఫిక్స‌యిపోయారు. మ‌రి ఆ క‌థ‌ల‌కూ, ఆ ప్రాజెక్టుల‌కూ మోక్షం ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

“చేయూత” డబ్బులతో వ్యాపారం నేర్పిస్తున్న జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసం.. మరో వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తాడేపల్లిలోని ఇంటి నుంచి ప్రారంభించారు. ఏడాదికి రూ. 18,750 ఇచ్చే ఈపథకం...

HOT NEWS

[X] Close
[X] Close