తర్వాత వివాదం … స్కూళ్ల రంగులు..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్కూళ్లకు నిర్వహిస్తున్న నాడు-నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. మిగతా విషయాలు ఎప్పుడూ చెప్పేవే కానీ.. కొత్తగా ఒకటి చెప్పారు… చెప్పారు అనడం కంటే.. ఆదేశించారు అనడం కరెక్ట్. స్కూళ్లకు “ఆహ్లాదమైన రంగులు” ఉండాలి అనేది ఆ అదేశం. దీంతో అధికారులకు బల్బ్ వెలిగి ఉంటుంది. వెలగని అధికారులకు తర్వాత వెలిగేలా చేస్తారు.. అందులో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ అధినేతకు.. “ఆహ్లాదమైన రంగులు” అంటే…. తన పార్టీ రంగులు మాత్రమే. ఆ విషయం ఇప్పటికి అనేక సార్లు రుజువు అయింది. ప్రభుత్వ భవనాలకు వేసిన ఆహ్లాదకరమైన రంగులు ఎంత వివాదాస్పదం అయ్యాయో.. చూస్తూనే ఉన్నాం.

వైసీపీ అధినేతకు.. రంగుల పై అంత ఇష్టం ఎందుకో కానీ.. వైసీపీ రంగలలను.. కరెంట్ పోల్స్ సహా అన్నింటికీ పులిమేయించారు. దిశ చట్టం రాకుండానే ఏర్పాట్లు చేసిన దిస పోలీస్ స్టేషన్టలకు.. కొన్ని చోట్ల దాతలు నిధులిచ్చారు. ఆ పోలీస్ స్టేషన్లకు కూడా.. బులుగు రంగు పూయించారు. ఇక అంబులెన్స్‌ల గురించి చెప్పాల్సిన పని లేదు. నేషనల్ అంబులెన్స్ కోడ్‌ను కూడా పట్టించుకోకుండా.. రంగులేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై రేపో మాపో.. ఎవరైనా కోర్టుకు వెళ్తే.. ప్రజా ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి.. తీవ్రమైన హెచ్చరికలు వస్తాయన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో ఉంది.

తాజాగా.. జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ప్రకారం..”ఆహ్లాదమైన రంగులు” స్కూళ్లకు కూడా వేయడం ఖాయమే. నాడు-నేడు పేరుతో.. ఇప్పటికీ పలు రకాల అభివృద్ధి పనులను స్కూళ్లకు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఆ లోపు రంగులు కూడా వేసేస్తారన్నమాట. రంగులు ఇంకా ఖరారు చేయలేదు. ఖరారు చేసినా.. వేసే వరకు బయట పెట్టారు. వేసిన తర్వాత మాత్రమే… అది “మ్యాటర్” అవుతుంది. అంటే.. మరో వివాదం కోసం అలా ఎదురు చూడాల్సిందేనేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ పోలీసుల పనితీరు రాష్ట్రపతి భవన్‌ వరకూ వెళ్లింది..!

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బ్యాడ్ టైం కొనసాగుతోంది. వరుసగా సీబీఐ విచారణలకు తోడు... రాజకీయ కారణాలతో ప్రాథమిక హక్కులను హరిస్తున్నారన్న ఫిర్యాదులు రాష్ట్రభవన్ వరకూ వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ప్రసాద్...

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...

HOT NEWS

[X] Close
[X] Close