ఇళ్ల స్థలాల పంపిణీని టీడీపీనే అడ్డుకుందన్న జగన్..!

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వరుసగా వాయిదా వేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం… ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందనే ప్రచారాన్ని ప్రారంభించారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలపై టీడీపీ కోర్టుకెళ్లిందని..అందుకే.. వాయిదా పడిందని.. చెప్పడం ప్రారంభించారు. డి-పట్టాల రూపంలో ఇవ్వాలనుకుంటే ఈరోజే ఇవ్వొచ్చని .. కానీ రిజిస్ట్రేషన్‌ చేసి ఆస్తి రూపంలో ఇవ్వాలని భావించామని జగన్ చెబుతున్నారు. ఇప్పటికే ఇళ్ల పట్టాల కోసం 62 వేల ఎకరాలు సేకరించామని రూ.7,500 కోట్లు ఖర్చు చేశామన్నరాు. సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తుందని .. ఆగస్టు 15న పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తన్నామని ప్రకటించారు.

నిజానికి సుప్రీం కోర్టులో ఇళ్ల స్థలాలపై పిటిషన్ వేసింది ఏపీ ప్రభుత్వమే. ప్రభుత్వం పేదలకు ఇచ్చే స్థలాలు అమ్ముకునే అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అయితే ప్రభుత్వం మాత్రం… నిబంధనలకు విరుద్ధమైనా సరే.. పేదలకు ఇచ్చే స్థలాలు వారు అమ్ముకోవచ్చంటూ… జీవో నెంబర్ 44 విడుదల చేసింది. ఈ జీవో 44నే హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇది విచారణకు రావాల్సి ఉంది. అయినప్పటికీ.. వైఎస్ జయంతి రోజున.. ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ ప్రకటనలు చేసేశారు. రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా రెడీ చేశారు.

అయితే.. సుప్రీకోర్టులో కేసు విచారణకు రాకుండా.. హైకోర్టు జీవోను కొట్టివేసిన తర్వాత కన్వేయన్స్ డీడ్ రూపంలో పట్టాలు పంపిణీ చేస్తే కోర్టు ధిక్కారం అవుతుందన్న ఉద్దేశంతో చివరి క్షణంలో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. సుప్రీంకోర్టులో అయినా… అసైన్డ్ చట్టాలకు విరుద్ధంగా ఉన్న 44వ జీవోకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకం లేదని.. న్యాయవర్గాలే చెబుతున్నాయి. దీంతో.. మళ్లీ డీ -పట్టాల రూపంలోనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా చేసినా.. ఆగిపోతే.. టీడీపీ పై నెట్టేస్తే పనైపోతుందని.. వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. నిన్నటి నుంచి వైసీపీ నేతలు టీడీపీ నేతలు అడ్డుకున్నారనే వాదనను వినిపించడం ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close