ఫ్లాష్ బ్యాక్‌: ఏఎన్నార్ డూప్ టూ‌ మూవీ మొఘ‌ల్‌!

1958 నాటి రోజులు. కారంచేడు అనే ఓ ఊరిలో ‘న‌మ్మిన బంటు’ సినిమా తీస్తున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరో. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌కుడు. ఊర్లో షూటింగ్ అంటే మామూలుగా ఉండేదా? ఆ హ‌డావుడే వేరు. షూటింగంటే ఊరూ, వాడ అంతా అక్క‌డే ఉండేది. కారంచేడులో ఐదారు రైసు మిల్లులున్న ఓ ఆసామికీ షూటింగులంటే ఇష్టం. అందుకే.. `న‌మ్మిన‌బంటు` షూటింగ్ జ‌రిగిన‌నన్ని రోజులూ.. ఆ చిత్ర‌బృందానికి ఏ లోటూ రాకుండా చూసుకునే బాధ్య‌త త‌న‌కు తానుగా త‌న భుజాల‌పై వేసుకున్నాడు. భోజ‌నాల‌న్నీ ఆ ఇంటి ద‌గ్గ‌ర్నుంచే. సెట్లో ఫ‌లానా వ‌స్తువు కావాలంటే, నిర్మాత‌ని అడిగేవారు కాదు. ఆ పెద్దాయ‌న ద‌గ్గ‌ర‌కే వెళ్లేవారు. వేల‌కు వేలు.. త‌న జేబులోంచి తీసి ఖ‌ర్చు చేసేవాడు. ఏర్పాట్ల‌న్నీ చూసి… `ఈ కుర్రాడేంటి? ఇంత స్పీడుగా ఉన్నాడు` అంటూ ఏఎన్నారే ఆశ్చ‌ర్య‌పోయారంటే న‌మ్మండి.

న‌మ్మిన బంటులో ఎడ్ల‌బండి పోటీల‌కు సంబంధించిన ఓ ఎపిసోడ్ ఉంది. అక్కినేని, సావిత్రి ఈ పోటీలో పాల్గొంటారు. అక్కినేనికి అంత‌కు ముందు ఎడ్ల‌బండ్ల‌ని న‌డిపిన అనుభ‌వం లేదు. దాంతో… ఆయ‌నకు డూప్ గా న‌టించ‌డానికి ఆ రైసు మిల్లు ఓన‌రే ముందుకొచ్చాడు. ఆ సీన్లు ఇప్ప‌టికీ చూస్తే.. లాంగ్ షాట్‌లో ఉన్న‌వ‌న్నీ డూప్‌తో తీసిన‌వే. క్లోజ‌ప్‌లో మాత్రం అక్కినేని ఎక్స్‌ప్రెష‌న్స్ క‌నిపిస్తాయి. ఓ సినిమా కోసం.. ఇంత‌గా త‌పిస్తున్న కుర్రాడిని చూసి ఆ చిత్ర నిర్మాత యార్ల‌గ‌డ్డ వెంక‌న్న చౌద‌రి `ఈ సినిమాలో నీకు 5 పైస‌ల వాటా ఇస్తాం.. తీసుకో` అని ఆఫ‌ర్ చేశారు. కానీ ఆ కుర్రాడు ఒప్పుకోలేదు. `నాకు సినిమాల‌న్నా, షూటింగుల‌న్నా చాలా ఇష్టం. మీరంతా నా ఆతిథ్యం స్వీక‌రించారు. సినిమా పూర్తి చేశారు. అదే చాలు..` అన్నాడు. ఈ వాటాలు వ‌ద్దు.. తీస్తే సినిమానే తీస్తా – అంటూ ధీమాగా మాట్లాడాడు. ఆ రైసు మిల్లు ఓన‌రే, ఏఎన్నార్‌కి డూప్‌కి న‌టించిన ఆ కుర్రాడే.. ఆ త‌ర‌వాత సినిమా ఇండ్ర‌స్ట్రీలోకి అడుగ‌పెట్టి, నిర్మాత‌గా మారి, అక్కినేనితోనే సిల్వ‌ర్ జూబ్లీలు తీసి, ఓ స్టూడియోని స్థాపించి, తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించి, దేశం మొత్తంలోనే నిర్మాత‌ల‌కు దిక్చూచీగా నిలిచి, మూవీ మొఘ‌ల్ గా కీర్తి గ‌డించిన.. డా.డి. రామానాయుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

“చేయూత” డబ్బులతో వ్యాపారం నేర్పిస్తున్న జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసం.. మరో వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తాడేపల్లిలోని ఇంటి నుంచి ప్రారంభించారు. ఏడాదికి రూ. 18,750 ఇచ్చే ఈపథకం...

HOT NEWS

[X] Close
[X] Close