‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 – 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి… అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా – ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా, స్టార్లు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. వ‌ద్దామ‌న్నా 30 – 40 మందితో షూటింగులు చేసుకోవ‌డం క‌ష్ట‌మ‌ని వాళ్ల‌కు అర్థ‌మైపోయింది. పుష్ష కూడా ఈపాటికి సెట్స్‌పైకి వెళ్లిపోవాల్సిందే. కానీ.. ఈ ప‌రిమితుల మ‌ధ్య షూటింగ్ చేయ‌లేమ‌ని సుకుమార్ అండ్ కో భావించి ఆప్ర‌య‌త్నాన్ని మానుకున్నారు.

ఇప్పుడు పుష్ష టీమ్ ఓ భారీ స్కెచ్ వేస్తోంది. త్వ‌రలోనే ‘పుష్ష‌’ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే 30 – 40 మందితో కాదు.200మందితో. హైద‌రాబాద్ శివార్ల‌లోని అట‌వీ ప్రాంతంలో షూటింగ్ చేయ‌డానికి సుకుమార్ టీమ్ స‌న్న‌ద్ధం అవుతోంది. అక్క‌డ ఓ రిసార్ట్స్ లాంటిది ఏర్పాటు చేసి, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ప్ర‌త్యేక రూములు, అద‌న‌పు సౌర‌క్యాలూ క‌ల్పించి – లోప‌ల‌కి వెళ్లిన వాళ్లు, బ‌య‌ట‌కు.. బ‌య‌ట‌కు వ‌చ్చిన వాళ్లు లోపల‌కు రానివ్వ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్ల మ‌ధ్య షూటింగ్ చేసుకోవ‌డానికి ప్లాన్ చేస్తున్నార్ట‌. వంటా వార్పు.. కూడా సెట్స్ లోప‌లే. బ‌య‌ట ఫుడ్ అనుమ‌తించరు. సెట్లో ఉన్న‌వాళ్లంద‌రికీ కొవిడ్ ప‌రీక్ష‌లు చేసి, వాళ్ల‌లో ఎవ‌రికీ కరోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని నిర్దారించుకున్న త‌ర‌వాతే టీమ్ లోకి తీసుకుంటార్ట‌. అయితే ఇంత‌మందితో షూటింగ్ చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వ అనుమ‌తి అవ‌స‌రం. ఈ విష‌య‌మే… అధికారుల్ని సంప్ర‌దించి, సోష‌ల్ డిస్టెన్స్ మ‌ధ్య షూటింగు ఎలా చేసుకుంటామో వివ‌రించి, పర్మిషన్లు తీసుకోవాల‌ని భావిస్తోంది. అయితే ఇదంతా ఓ ఆలోచ‌న మాత్ర‌మే. ఆచ‌రించ‌డం సాధ్య‌మా? కాదా అనే విష‌యాల‌పై సుకుమార్ టీమ్ రెక్కీ నిర్వ‌హిస్తోంద‌ట‌. సానుకూల ఫ‌లితాలు వ‌స్తాయ‌నుకుంటే, రిస్కు త‌క్కువ అనుకుంటే.. ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తో షూటింగు మొద‌లెట్టాల‌ని భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close