మ‌ళ్లీ ‘సింహా’ ఫార్ములానే!

సింహా, లెజెండ్‌… ద‌ర్శ‌కుడిగా బోయ‌పాటి స్టామినాని చూపించిన సినిమాలివి. బాల‌య్య కెరీర్‌లోనే అతిపెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ గా నిలిచాయి. బాల‌య్య‌ని స‌రికొత్త కోణంలో చూపించిన సినిమాలివి. ఇందులో బాల‌య్య గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రీ… రెండూ విభిన్నంగా ఉంటాయి. ఈమధ్య కాలంలో బాల‌య్య‌ని ఇంత ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించింది బోయ‌పాటి శ్రీ‌నునే అనేది అభిమానుల మాట‌. అది నిజం కూడా. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రాబోతోంది. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.

ఈసారి కూడా బోయ‌పాటిశ్రీ‌ను.. సింహా స్టైల్‌నే ఫాలో అవుతున్నాడ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. సింహాలో బాల‌య్య రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తాడు. ఓ పాత్ర రాయ‌ల్‌గా ఉంటుంది. మ‌రో పాత్ర మాసీగా సాగుతుంది. ఈసారి కూడా బాల‌య్య పాత్ర‌లో ఈ రెండు కోణాలూ ఉంటాయ‌ని తెలుస్తోంది. నిజానికి బాల‌య్య‌తో ఓ పొలిటిక‌ల్ సినిమా తీయాల‌న్న‌ది బోయ‌పాటి ఆలోచ‌న‌. దానికి సంబంధించిన క‌థ కూడా సిద్ధ‌మైపోయింది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ సినిమా తీసుకురావాల‌నుకున్నారు. కానీ… ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల ముందు ఈ సినిమాని విడుద‌ల చేయ‌డం సాధ్యం కాదు. ఎన్నిక‌లు అయ్యాక‌,.. ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో తెలీదు. అందుకే అస‌లు పొలిటిక‌ల్ ట‌చ్ లేని సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యారు. దాని కోసం క‌థ‌ని కూడా మార్చాడ‌ని తెలుస్తోంది. ముందు అనుకున్న క‌థ‌ని ప‌క్క‌న పెట్టి.. బోయ‌పాటి చెప్పిన లేటెస్ట్ వెర్ష‌న్‌ని బాల‌య్య ఓకే చేశాడ‌ట‌. మొత్తానికి మ‌నమంతా సింహా 2ని చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close