బాల‌య్య సినిమా ఆల‌స్యం..?

క‌థానాయ‌కుడు, మ‌హా నాయ‌కుడు త‌ర‌వాత‌.. బాల‌కృష్ణ బోయ‌పాటితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నులు పూర్త‌వుతున్నాయి. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్‌కి వెళ్లాలి. కాక‌పోతే.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కాస్త ఆల‌స్య‌మ‌య్యేలా కనిపిస్తోంది. బాల‌య్య ఫిట్ నెస్ కోస‌మే ఈ సినిమా లేట్ అయ్యే ఛాన్సుంద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌య్య చాలా లావుగా క‌నిపించాడు. ఆ పాత్ర‌కు ఆ రూపు రేఖలు అవ‌స‌రం కూడా. అయితే.. బోయ‌పాటి మాత్రం `ఈ సినిమా కోసం బ‌రువు త‌గ్గాల్సిందే` అని క‌చ్చితంగా చెప్పాడ‌ట‌. ఎల‌క్ష‌న్ సీజ‌న్‌లో త‌న ఫిట్ నెస్‌పై శ్ర‌ద్ద చూపించ‌లేక‌పోయాడు బాల‌య్య‌. మండుటెండ‌ల్లో తిరిగీ తిరిగీ… బాల‌య్య త‌న గ్లామ‌ర్‌ని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు సినిమాకి త‌గిన‌ట్టుగా త‌న రూపు రేఖ‌ల్ని మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకే.. ఈ సినిమా కోసం బాల‌య్య టైమ్ తీసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. బోయ‌పాటి కూడా.. `ఆల‌స్యం అయినా ఫ‌ర్వాలేదు… ముందు మీరు బరువు త‌గ్గండి` అంటున్నాడ‌ట‌. మే 23 వ‌ర‌కూ… ఎన్నిక‌ల వేడి ర‌గులుతూనే ఉంటుంది. ఆ టెన్ష‌న్లు బాల‌య్య‌కు త‌ప్ప‌వు. ఆ త‌ర‌వాత కూడా కొంత విరామం అవ‌సరం. రిల‌జ్ట్ వ‌చ్చాక‌, ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగాక‌… బాల‌య్య సినిమా ప‌ట్టాలెక్కుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com