‘పూరి’పై బాల‌య్య పంచ్‌

నంద‌మూరి బాల‌కృష్ణ‌… ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడ‌తారో అంచ‌నా వేయ‌డం చాలా క‌ష్టం. ఆయ‌న ఏ విష‌యంలోంచి, ఏ విష‌యంలోకైనా ‘జంప్’ అయిపోతారు. కొన్నిసార్లు ఆయ‌న మాట‌లు భ‌లే స‌ర‌దాగా అనిపిస్తాయి. రేపు బాల‌కృష్ణ 60వ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా టీవీ ఛాన‌ళ్ల‌కు ఆయ‌న వ‌రుస‌గా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఓ టీవీ ఛాన‌ల్ తో మాట్లాడుతూ పూరిపై పంచ్ వేశారు.

మీ అబ్బాయి మోక్ష‌జ్ఞ తొలి సినిమా.. పూరితోనా? అని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు బాల‌య్య వెంట‌నే స్పందిస్తూ..

పూరీనా.. ఇడ్లీ, ఉప్మాలు లేవా? అంటూ కౌంట‌రేశారు.

పూరితో బాల‌య్య‌కు మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రి కాంబోలో పైసా వ‌సూల్ సినిమా వ‌చ్చింది. త్వ‌ర‌లోనే బాల‌య్య‌తో మ‌ళ్లీ ప‌ని చేస్తాన‌ని పూరి ఈమ‌ధ్యే చెప్పారు. మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమా పూరి భుజాల‌పై ప‌డింద‌ని వార్త‌లొచ్చాయి కూడా. వీటిపై ఇప్పుడు ఇలా స్పందించాల్సివ‌చ్చింది బాల‌య్య‌.

“మోక్ష‌జ్ఞ ఎంట్రీ భారీగా ఉంటుంది. అద్భుత‌మైన కథ‌లు రెడీ చేసి పెట్టాం. చూస్తారుగా“ అంటూ మోక్ష‌జ్ఙ ఎంట్రీపై మ‌రిన్ని ఆశ‌లు, అంచ‌నాలు రేకెత్తించారు బాల‌య్య‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close