రిలీజ్ డేట్‌పై బాల‌య్య ఏమ‌న్నాడు?

ఖైదీ నెం. 150 రిలీజ్ డేట్ జ‌న‌వ‌రి 11 అని ఎప్పుడు ఫిక్స్ అయ్యిందో… అప్పుడే బాల‌కృష్ణ సినిమా గౌత‌మి పుత్ర రిలీజ్ డేట్ కూడా ముందుకు రావొచ్చ‌న్న ఊహాగానాలు వినిపించాయి. ఈ విష‌యంపై బాల‌య్య అభిమానులు క్రిష్‌పై ఒత్తిడి తీసుకురావ‌డం, నిర్మాత‌లు కూడా ‘రిలీజ్‌డేట్ మారుద్దామా’ అనే మీమాంశ‌లో ప‌డ‌డం అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ క్రిష్ మాత్రం 12నే వ‌స్తున్నాం.. అంటూ బల్ల‌గుద్ది మ‌రీ చెప్పాడు. అయితే ఈ విష‌యంలో బాల‌య్య‌ఫ్యాన్స్ కాస్త నిరాశ‌కు లోనైన మాట వాస్త‌వం. చిరుతో పోటాపోటీగా ఒకేరోజున రెండు సినిమాలూ విడుద‌ల అయితే బాగుంటుంద‌న్న‌ది వాళ్ల ఉద్దేశం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బాల‌య్య ద‌గ్గ‌ర‌కే తీసుకెళ్లారు అభిమానులు. బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితంగా, వాళ్లింటి స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించే ఒక‌రిద్ద‌రు అభిమానులు 11నే విడుదల చేస్తే బాగుంటుంద‌న్న‌ది అభిమానుల మాట‌గా బాల‌య్య ద‌గ్గ‌ర చెప్పార‌ని టాక్‌.

అభిమానుల నిర్ణ‌యాన్ని గౌర‌వించే బాల‌య్య‌.. క‌చ్చితంగా రిలీజ్ డేట్ విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకొంటార‌ని, 11నే వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని భావించారు. కానీ బాల‌య్య మాత్రం విడుద‌ల తేదీ మార్చ‌మ‌ని అటు క్రిష్‌ని గానీ, ఇటు నిర్మాత‌ల్ని గానీ అడ‌గ‌లేద‌ట‌. ‘ముందు అనుకొన్న‌ది 12నే క‌దా.. అప్పుడే విడుద‌ల చేద్దాం.’ అంటూ హుందాగా అభిమానుల‌కు స‌ర్ది చెప్పాడ‌ట‌. దాంతో క్రిష్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నాడు. బాల‌య్య మా నిర్ణ‌యాన్ని గౌర‌వించారు.. అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నాడు క్రిష్‌. ఒకవేళ బాల‌య్య రిలీజ్ డేట్ మ‌ర్చ‌మ‌ని అడిగితే.. క్రిష్ మీమాంశ‌లో ప‌డిపోదును. బాల‌య్య నిర్ణ‌యాన్ని కాద‌న‌లేడు.. అలాగ‌ని రిలీజ్ డేట్ మార్చ‌లేడు. ఈ ఇబ్బందిని గ‌మ‌నించిన బాల‌య్య‌.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేద‌ని, వాళ్ల నిర్ణ‌యాన్ని గౌర‌వించాడ‌ని, ఇది బాల‌య్య గొప్ప‌ద‌న‌మ‌ని అభిమానులు కూడా మురిసిపోతున్నారు. బాల‌య్య అంటే.. అంతే క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియా కాల్ లిస్ట్‌లో రకుల్, రానా ..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి కాల్ లిస్ట్‌లో టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. బాలీవుడ్ స్టార్లు కూడా ఉన్నారు. కాల్ లిస్ట్‌ను బయటకు...

నన్ను సస్పెండ్ చేయండి ప్లీజ్: జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ " నేను మొదటి నుండి వైఎస్ఆర్సిపి మనిషినే" అని నిన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందే తాను వైఎస్ఆర్సిపి టికెట్ కోసం...

ఏపీ పోలీసుల పనితీరు రాష్ట్రపతి భవన్‌ వరకూ వెళ్లింది..!

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బ్యాడ్ టైం కొనసాగుతోంది. వరుసగా సీబీఐ విచారణలకు తోడు... రాజకీయ కారణాలతో ప్రాథమిక హక్కులను హరిస్తున్నారన్న ఫిర్యాదులు రాష్ట్రభవన్ వరకూ వెళ్లాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ప్రసాద్...

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

HOT NEWS

[X] Close
[X] Close