గౌత‌మి పుత్ర‌కు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల బ‌హుమ‌తి

తెలుగు జాతి ఖ్యాతి ని న‌లుదిశ‌గా వ్యాప్తి చేసిన చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి. తెలుగు చ‌రిత్ర‌లో ఆ మ‌హ‌నీయునిది ఓ సువ‌ర్ణ అధ్యాయం. ఉగాది ప‌ర్వ‌దినం జ‌రుపుకొంటున్నామంటే… అది తెలుగువాళ్ల పండ‌గ అయ్యిందంటే అది శాత‌క‌ర్ణి చ‌ల‌వే. శాంతి కోసం యుద్ధం చేసిన చ‌రిత్ర పురుషుడిగా శాత‌క‌ర్ణికి చ‌రిత్ర జేజేలు ప‌లుకుతోంది. అలాంటి చ‌క్ర‌వ‌ర్తి జీవిత గాథ‌ని క్రిష్‌.. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణిగా వెండి తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ఇది మ‌న సినిమా.. తెలుగువాళ్లంతా గ‌ర్వంగా చెప్పుకోవాల్సిన సినిమా. అందుకే… తెలుగు ప్ర‌భుత్వాలు రెండూ ఈ ప్ర‌య‌త్నానికి వెన్నుద‌న్నుగా నిల‌వాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాయి. ఈ సినిమాపై వినోద‌పు ప‌న్ను మిన‌హాయించాల‌ని అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెండూ కీల‌క నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు స‌మాచారం. వీటిపై త్వ‌ర‌లోనే ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. ప‌న్ను మిన‌హాయించ‌డం వ‌ల్ల టికెట్ రేట్లు త‌గ్గే అవ‌కాశం ఉంది. రేట్లుత‌గ్గేది అంతంత మాత్ర‌మే అయినా.. ఓ సినిమాకి ప‌న్ను మిన‌హాయింపు ల‌భించ‌డం ఓ అరుదైన గౌర‌వం. గౌత‌మి పుత్ర ప్రారంభోత్స‌వానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఆడియో పండ‌గ‌కి విశిష్ట అతిథిగా చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రికీ త్వ‌ర‌లోనే ఓ ప్ర‌త్యేక ప్ర‌దర్శ‌న ఏర్పాటు చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అంత‌కంటే ముందే ప‌న్ను రాయితీపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న జారీ చేసే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బాక్‌: ఎన్టీఆర్ కృష్ణ‌ల ‘కురుక్షేత్ర‌’ యుద్ధం

ఒకేరోజు.. రెండు సినిమాలు, అందునా స్టార్ సినిమాలు విడుద‌ల కావ‌డం కొత్తేం కాదు. కానీ.. రెండూ ఇంచుమించుగా ఒకే క‌థ‌తో విడుద‌లైతే, రెండూ ఒకే జోన‌ర్ అయితే.. ఎలా ఉంటుంది? ఆ...

రానా పెళ్లిలో… ప్ర‌భాస్ ‘బావ‌’ మిస్సింగ్‌

శ‌నివారం రాత్రి రానా -మిహిక‌లు అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. లాక్ డౌన్, క‌రోనా గొడ‌వ‌లు లేక‌పోతే, ఈ పెళ్లి ధూంధామ్‌గా జ‌రిగేది. కానీ లాక్ డౌన్ ప‌రిమితుల వ‌ల్ల కేవ‌లం 50మంది అతిథుల‌కే...

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : జగన్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ... కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.....

నాని సినిమాని సీక్వెల్ వ‌స్తోంది

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ స్థాపించి 'అ' సినిమాతో బోణీ కొట్టాడు నాని. నిర్మాత‌గా త‌న అభిరుచి ఎలాంటిదో తొలి సినిమాతోనే చూపించాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. 'అ' క‌మర్షియ‌ల్ గా...

HOT NEWS

[X] Close
[X] Close