క‌ల్యాణ్ రామ్ టైటిల్ మార్చేసిన బాల‌కృష్ణ‌

బాల‌కృష్ణ స్పీచుల్లో ఎప్పుడూ ఏదో ఓ వెరైటీ క‌నిపిస్తుంటుంది. అందుకే ఆయ‌న మైకు ఎప్పుడు ప‌ట్టుకున్నా కావ‌ల్సినంత ఫ‌న్ దొరికేస్తుంటుంది. కొన్ని పేర్లు త‌ప్పుగా ప‌ల‌క‌డ‌మో, టైటిళ్ల‌ని మార్చేయ‌డ‌మో బాల‌య్య‌కు అల‌వాటు. `118` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లోనూ అదే జ‌రిగింది. క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. మార్చి 1న విడుద‌ల అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌లు అతిథులుగా వ‌చ్చారు. బాల‌య్య త‌న ప్ర‌సంగంలో ఈ సినిమా పేరుని త‌ప్పుగా ఉచ్ఛ‌రించారు. `189` అంటూ మార్చేశారు. ఒక‌సారి కాదు.. ప‌దే ప‌దే ఇదే జ‌రిగింది. అయితే స‌ర్దిచెప్ప‌డానికి ఏ ఒక్క‌రూ సాహ‌సం చేయ‌లేక‌పోయారు. క‌ల్యాణ్ రామ్‌లో త‌ప‌న ఉంద‌ని, ఆ త‌ప‌న‌తోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ని స్థాపించి కొత్త వాళ్ల‌కు అవ‌కాశాలు ఇస్తున్నాడ‌ని మెచ్చుకున్నారు బాల‌య్య‌. ఈ టైటిల్ వింటే, క‌థేంటో చెప్ప‌లేక‌పోతున్నామ‌ని, అయితే యువ‌త‌రానికి న‌చ్చేలా ఉంద‌ని, ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌య‌వంత‌మ‌వుతుంద‌ని ఆభాభావం వ్య‌క్తం చేశారు.

క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు.. ఇలా వ‌రుస‌గా రెండు ఫ్లాపులు రావ‌డం వ‌ల్లేమో.. బాల‌య్య స్పీచులో ఇది వ‌ర‌క‌టి ఉత్సాహం క‌నిపించ‌లేదు. ఏదో మొక్కుబ‌డిగా నాలుగు మాట‌లు మాట్లాడేసి వెళ్లిపోయాడు. ఎన్టీఆర్ కూడా డ‌ల్‌గా క‌నిపించాడు. త‌న స్పీచ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ సినిమా చూశాన‌ని, అన్న‌య్య కెరీర్‌లోనే అత్యుత్త‌మ చిత్రంగా మిగిలిపోతుంద‌ని, ముఖ్యంగా నివేదా థామ‌స్ న‌ట‌న క‌న్నీరు తెప్పించింద‌ని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్ . స్పీచులు ఎలాగున్నా.. నంద‌మూరి హీరోలు ముగ్గురినీ ఒకే వేదిక‌పై చూడ‌డం మాత్రం నంద‌మూరి అభిమానులకు పండుగ‌లా అనిపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ పార్టీకి ” వైఎస్ఆర్” నోటీసులొచ్చాయ్..!

జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని యువజన శ్రామిత రైతు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఎలా వాడుకుంటున్నారంటూ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలా...

పవన్ కి మద్దతివ్వను, జగన్ ని ప్రశ్నించను, కేంద్రంపై నెట్టిస్తా, తప్పుకుంటా: ముద్రగడ లేఖ

ముద్రగడ పద్మనాభం తమ జాతిని ఉద్దేశించి మరొకసారి సుదీర్ఘమైన లేఖ రాశారు. 2 వారాల క్రితం ముద్రగడ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాసిన లేఖ సొంత సామాజిక వర్గం నుండే విమర్శలు పొందడం...

“కాపు రిజర్వేషన్ ఉద్యమం” కాడి దించేసిన ముద్రగడ..!

గజదొంగ, కులద్రోహి అంటున్నారని.. ఆ ఆవేదన భరించలేని.. అందుకే కాపు ఉద్యమం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని... ముద్రగడ పద్మనాభం ప్రకటన చేశారు. ఈ మేరకు..బహిరంగ లేఖ విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కాపులకు...

అనవసరమైన ట్వీట్లతో గందరగోళం సృష్టిస్తున్న నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కానీ, సినీ రంగంలో ప్రత్యర్థులు కానీ చిరంజీవి పైన లేదంటే పవన్ కళ్యాణ్ పై నోరు...

HOT NEWS

[X] Close
[X] Close