ప్రొ.నాగేశ్వర్ : జగన్‌ కోసం టీఆర్ఎస్ జపం ఎందుకు..?

ఏపీ రాజకీయాలపై ఇప్పుడు… తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యక్ష ప్రభావం కనిపిస్తోంది. టీఆర్ఎస్ నేతలు… చంద్రబాబును ఓడించి తీరుతామని ప్రకటిస్తారు. అదే సమయంలో కేటీఆర్.. జగన్ ముఖ్యమంత్రి అయి తీరుతారని చెబుతున్నారు. కేసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ కూడా.. ఇవ్వడం ప్రారంభించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో పర్యటిస్తున్నారు. పలువురు టీడీపీ నేతల్ని కలుస్తున్నారు. ఇదంతా ఓపెన్ రాజకీయం అయిపోయింది.

టీడీపీని ఓడించాలని టీఆర్ఎస్ ఎందుకు అనుకుంటోంది..?

చంద్రబాబునాయుడుని ఓడించడానికి జగన్‌తో కలుస్తున్నాం అని కేసీఆర్ నేరుగానే చెబుతున్నారు. గతంలో ఓ అనుమానం ఉండేది… జగన్‌తో కలుస్తారా..? పవన్‌తో కలుస్తారా..? అని. అప్పట్లో పవన్ కల్యాణ్ ప్రగతి భవన్‌కు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత కేసీఆర్‌కు అనుకూలంగా ప్రకటనలు చేశారు. అయితే.. జగన్‌తో టీఆర్ఎస్ కలవబోతోందన్న పరిణామాలు జరిగిన తర్వాత పవన్ కల్యాణ్ తన విధానాన్ని మార్చుకున్నారు. అందరి కంటే ముందుగానే… జగన్, కేసీఆర్ కలుస్తున్నారని ప్రకటించారు. విమర్శలు కూడా చేశారు. టీఆర్ఎస్ ఇదంతా ఎందుకు చేస్తుంది..? తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు యాక్టివ్ పార్ట్ తీసుకున్నప్పుడే.. టీఆర్ఎస్‌ ఈ విధమైన నిర్ణయం తీసుకుని ఉంటుంది. చంద్రబాబు.. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమిని ఏర్పాటు చేసి.. కాంగ్రెస్‌తో కలిసి… పోటీ చేయడమే కాదు.. ఉద్ధృతంగా ప్రచారం చేశారు కూడా., దీన్ని టీఆర్ఎస్… తమ పుట్టలో వేలు పెట్టడంగా భావించింది. అందుకే ఇప్పుడు ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా వైఖరి తీసుకుంది.

ఏపీకి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారా..?

చంద్రబాబును ఓడించాలన్న లక్ష్యంతో కేసీఆర్… జగన్‌కు మద్దతిస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో.. భాగస్వామ్యం కోసం… కేటీఆర్‌ను పంపి చర్చలు జరిపారు. త్వరలోనే కేసీఆర్ కూడా కలుస్తారంటున్నారు. కేసీఆర్ కలవడం వల్ల.. జగన్‌కు నష్టం అవుతుందన్న అంచనాలతో ప్రస్తుతానికి ఆగిపోయారు. అయితే.. ఏపీకి వెళ్లినా వెళ్లకపోయినా… తెలంగాణ నుంచే.. చంద్రబాబు ఓడిపోతారని చెబుతూ.. టీఆర్ఎస్ మైండ్ గేమ్ ప్రారంభించింది. ఇలాంటివి ఇంకా ముందు ముందు.. చాలా ఉంటాయి. అయితే.. కేసీఆర్ నేరుగా.. ఏపీకి వెళ్లి జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తే మాత్రం… ఆ రిటర్న్ గిఫ్ట్ నిజంగా గిఫ్ట్ గా మారుతుంది. ఎందుకంటే… చంద్రబాబునాయుడు.. తెలంగాణకు వెళ్లి ప్రచారం చేసినప్పుడు… అంగీకరించలేదు. అలాంటిది.. కేసీఆర్… ఏపీకి వెళ్లి.. ప్రచారం చేస్తే.. అంగీకరిస్తారా..?. వెళ్తే జనం వస్తారు. అది కామన్.. తెలంగాణలో కూడా చంద్రబాబు వచ్చినా… బాలకృష్ణ వచ్చినా జనం వస్తారు. కానీ ఓట్లేస్తారా..? . అందుకే కేసీఆర్ నేరుగా ఆంధ్రకు వెళ్లి జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తే అది ఆశ్చర్యకరమైన అంశమే.

టీఆర్ఎస్ ప్రచారం జగన్‌కు లాభం కలిగిస్తుందా..?

కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తే పాత గాయాలన్నీ రేపుతున్నారు. గతంలో కేసీఆర్… అన్న దారుణమైన వ్యాఖ్యలన్నీ బయటకు తీస్తారు. గతంలో కేసీఆర్ ఆంధ్ర బ్రాహ్మణులపైన, బిర్యానీపైనే రకరకాల వ్యాఖ్యలు చేశారు. వాటిని ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే.. కేసీఆర్ మరో రకంగా ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్నారు. తమ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌లో ఉన్నారు కాబట్టి.. మా రాష్ట్ర రాజకీయాల్లో నేతలు.. తెలంగాణ ముఖ్యమంత్రితో బాగుండాలని కోరుకుంటారు… అని భావిస్తున్నారు. అలా ఉండటం వల్ల.. తమ ప్రచారానికి ఏపీలో స్పందన వస్తుందని నమ్ముతున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లోని సీమాంధ్రులు తమకు ఓట్లేశారని అంటున్నారు. హైదరాబాద్ లో సీమాంధ్రులు ఓట్లు వేయడం వేయరు.. ఏపీలో టీఆర్ఎస్‌కు ఓట్లేయడం వేరు. అంతిమంగా… టీడీపీ ఓడిపోతుందని ఓ మైండ్ గేమ్ మాత్రం… ప్రారంభించారు. చంద్రబాబు గెలుస్తారా… ఓడిపోతారా..అన్నది తేల్చాల్సింది ప్రజలే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.