అభిమానులతో కలిసి ‘డిక్టేటర్’ సినిమా చూసిన బాలకృష్ణ

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం డిక్టేటర్‌ను తిరుపతిలో కృష్ణతేజ ధియేటర్‌లో అభిమానుల మధ్య తిలకించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, అభిమానులే తనకు బలం అని, వాళ్ళు ఆనందంగా ఉండాలని, వాళ్ళేమి కోరుకుంటున్నారో, అది ఇవ్వటం తన ధర్మమని బాలయ్య చెప్పారు. డిక్టేటర్ చిత్రానికి దేశవిదేశాలలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని అన్నారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని చెప్పారు. లెజెండ్‌ను మించిన విజయం సాధిస్తుందని అన్నారు. సినిమా చూసిన తర్వాత మళ్ళీ నారావారి పల్లెకు చేరుకున్నారు.

బాలకృష్ణ కుటుంబ సమేతంగా నిన్నే చిత్తూరుజిల్లా నారావారిపల్లె వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బాలకృష్ణ కుటుంబాల సభ్యులు ఇవాళ, రేపు అక్కడే సంక్రాంతి పండగ చేసుకోనున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఇవాళ తెల్లవారుఝామునే లేచి నారావారిపల్లెలో జరిగిన భోగిమంటలలో పాల్గొన్నారు. అక్కడ విగ్గు లేకుండానే మీడియాముందుకు రావటం విశేెషం. మీడియాతో మాట్లాడుతూ, ఈ పండగలో తెలుగు ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తమ కుటుంబంలోకి వచ్చిన కొత్త సభ్యుడు మనవడితో తాము ఈ ఏడాది పండగ జరుపుకోబోతున్నామని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బాక్‌: ఎన్టీఆర్ కృష్ణ‌ల ‘కురుక్షేత్ర‌’ యుద్ధం

ఒకేరోజు.. రెండు సినిమాలు, అందునా స్టార్ సినిమాలు విడుద‌ల కావ‌డం కొత్తేం కాదు. కానీ.. రెండూ ఇంచుమించుగా ఒకే క‌థ‌తో విడుద‌లైతే, రెండూ ఒకే జోన‌ర్ అయితే.. ఎలా ఉంటుంది? ఆ...

రానా పెళ్లిలో… ప్ర‌భాస్ ‘బావ‌’ మిస్సింగ్‌

శ‌నివారం రాత్రి రానా -మిహిక‌లు అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. లాక్ డౌన్, క‌రోనా గొడ‌వ‌లు లేక‌పోతే, ఈ పెళ్లి ధూంధామ్‌గా జ‌రిగేది. కానీ లాక్ డౌన్ ప‌రిమితుల వ‌ల్ల కేవ‌లం 50మంది అతిథుల‌కే...

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : జగన్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ... కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.....

నాని సినిమాని సీక్వెల్ వ‌స్తోంది

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ స్థాపించి 'అ' సినిమాతో బోణీ కొట్టాడు నాని. నిర్మాత‌గా త‌న అభిరుచి ఎలాంటిదో తొలి సినిమాతోనే చూపించాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. 'అ' క‌మర్షియ‌ల్ గా...

HOT NEWS

[X] Close
[X] Close