డిక్టేటర్‌ రివ్యూ

రివ్యూ: డిక్టేటర్‌
బాలకృష్ణ నట విశ్వరూపం ‘డిక్టేటర్‌’
బ్యానర్ :ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ , వేదాశ్వ క్రియేషన్స్‌
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అంజలి,
సోనాల్‌ చౌహాన్‌, నాజర్‌, రతి అగ్నిహోత్రి,
పోసాని, సుమన్‌, షాయాజీ షిండే, అక్ష తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు
ఎడిటింగ్‌: గౌతంరాజు
సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌
బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: చిన్నా
రచన: శ్రీధర్‌ సీపాన
మాటలు: ఎం.రత్నం,
స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, గోపీమోహన్‌
నిర్మాణం: ఈరోస్‌ ఇంటర్నేషనల్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీవాస్‌
విడుదల తేదీ: 14.01.2016

నందమూరి బాలకృష్ణ మాస్‌ ఎంటర్‌టైనర్స్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌.. ఇలా అన్నిరకాల సినిమాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఈమధ్యకాలంలో బాలకృష్ణ దృష్టి పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ మీదే వుంది. అందుకే వరసగా సింహా, లెజెండ్‌, లయన్‌ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు 98 సినిమాలు పూర్తి చేసిన బాలయ్య తన 99వ సినిమాని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. లక్ష్యం, లౌక్యం, పాండవులు పాండవులు తుమ్మెద వంటి డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్స్‌ని తెరకెక్కించి సక్సెస్‌ అందుకున్న శ్రీవాస్‌కి తన 99వ సినిమాని రూపొందించే బాధ్యతను అప్పగించాడు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్‌ బేనర్‌పై తనే నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టి నందమూరి బాలకృష్ణను ‘డిక్టేటర్‌’గా ఒక కొత్త డైమెన్షన్‌లో చూపించేందుకు సిద్ధమయ్యాడు శ్రీవాస్‌. బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్‌ ఎక్కువ. సంక్రాంతికి ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన బాలయ్య ఈ సంక్రాంతికి ‘డిక్టేటర్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమా నందమూరి అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందా? బాలయ్యను డిఫరెంట్‌గా చూపించడంలో శ్రీవాస్‌ ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? ‘డిక్టేటర్‌’గా బాలకృష్ణ లో ఎలాంటి పవర్‌ని చూపించాడు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ:
డ్రగ్స్‌ సప్లై చేసే ఓ గ్యాంగ్‌తో చేతులు కలిపిన ఓ మినిస్టర్‌ కొడుకుని ఓ హోటల్‌లో తన సిబ్బందితో వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు ఓ పోలీస్‌ ఆఫీసర్‌. అయితే అతనితో వచ్చిన సిబ్బందే మినిస్టర్‌ కొడుకుతో చేతులు కలిపి ఆ ఆఫీసర్‌ని చంపేస్తారు. ఇదంతా ఆ హోటల్‌లోని ఓ వెయిటర్‌(రాజీవ్‌ కనకాల) చూస్తాడు. పోలీస్‌ ఆఫీసర్‌ హత్యకు సంబంధించిన సాక్ష్యాన్ని కూడా మాయం చెయ్యాలని మినిస్టర్‌ కొడుకు అనుచరులు అతన్ని వెంబడిస్తారు. కట్‌ చేస్తే అది ధర్మా సూపర్‌ మార్కెట్‌ అందులో చందు(నందమూరి బాలకృష్ణ) పనిచేస్తుంటాడు. అతనికి పెళ్ళయి అత్తగారింట్లోనే వుంటూ వుంటాడు. అతని భార్య కాత్యాయని(అంజలి) మాత్రం ఎక్కడో దూరంగా వుంటూ అప్పుడప్పుడు ఫోన్‌ చేస్తుంటుంది. ఫోన్‌లో మాత్రం కాత్యాయని చెల్లెలు శృతి(అక్ష) అక్కలా మాట్లాడుతూ వుంటుంది. సౌమ్యుడుగా, మంచివాడుగా సూపర్‌ మార్కెట్‌లోనూ, అతను వుండే కాలనీలోనూ పేరు తెచ్చుకున్న చందుకి అనుకోకుండా ఓ అమ్మాయి(సోనాల్‌ చౌహాన్‌) పరిచయమవుతుంది. మినిస్టర్‌ కొడుకు వెతుకుతున్న వెయిటర్‌ చెల్లెలే ఆ అమ్మాయి. అతను ఎక్కడ వున్నాడో చెప్పమని వాళ్ళు ఆమెను వేధిస్తూ వుంటారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఓ పబ్‌లో వున్న మినిస్టర్‌ కొడుకుని, అతని అనుచరుల్ని చంపేస్తాడు చందు. తన కొడుకుని చంపిన వాడిని తన చేతుల్తో చంపేస్తానని మినిస్టర్‌ ప్రతిజ్ఞ చేస్తాడు. ఇదిలా వుంటే సూపర్‌మార్కెట్‌లోనే పనిచేసే కాశీ విశ్వనాథ్‌ తనకు సాయంత్రంలోపు అతనికి రావాల్సిన డబ్బు వస్తుందన్న నమ్మకంతో సూపర్‌ మార్కెట్‌లోని 5 లక్షలు వాడేస్తాడు. డబ్బు పోయిందని తెలుసుకున్న సూపర్‌ మార్కెట్‌ మేనేజర్‌ పోలీసుల్ని పిలిపిస్తాడు. అయితే ఆ డబ్బు తనే తీశానని చందు ఆ నేరం తన మీద వేసుకుంటాడు. చందు అరెస్ట్‌ చెయ్యడానికి వచ్చిన సి.ఐ. ప్రభాకర్‌(అజయ్‌) మినిస్టర్‌ కొడుకుని, అతని గ్యాంగ్‌ని చంపింది అతనే అనే విషయాన్ని తెలుసుకుంటాడు. చందుని చంపాలని మినిస్టర్‌తోపాటు, డ్రగ్‌ గ్యాంగ్‌లోని చనిపోయిన ఓ అనుచరుడి అన్నయ్య కూడా ఎదురుచూస్తుంటాడు. చందుని వాళ్ళిద్దరికీ అప్పగించి క్యాష్‌ చేసుకోవాలని చూస్తాడు సి.ఐ. ప్రభాకర్‌. చందుని దొంగతనం కేసులో అరెస్ట్‌ చేశారని టి.వి.లో చూసి తెలుసుకున్న ధర్మా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ రాజశేఖర్‌ ధర్మా(సుమన్‌) వెంటనే హైదరాబాద్‌ బయల్దేరి వస్తాడు. చందు ఫ్యామిలీ మెంబర్స్‌ని కలుసుకున్న రాజశేఖర్‌ వారి ఇంట్లో వుంటున్నది చందు కాదని, అతను చంద్రశేఖర్‌ ధర్మా అన్నీ, ధర్మా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కి ఛైర్మన్‌ అతనే అని చెప్తాడు. లక్షల కోట్లకు అధిపతి అయిన చంద్రశేఖర్‌.. చందుగా అత్తగారింట్లో ఎందుకు వున్నాడు? అతని భార్య కాత్యాయనికి బదులుగా అతని చెల్లెలు శృతి ఫోన్‌లో ఎందుకు మాట్లాడుతూ వుంటుంది? అసలు చందు బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటి? చందు భార్య కాత్యాయని ఏమైంది? కోటీశ్వరుడైన చందు సూపర్‌ మార్కెట్‌లో ఎందుకు పనిచేస్తున్నాడు? చందు ‘డిక్టేటర్‌’గా మారడానికి రీజన్‌ ఏమిటి? వంటి ఇంట్రెస్టింగ్‌ విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ :
ఇప్పటివరకు ఎన్నో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చేసిన బాలకృష్ణకు మరో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేయడం, పదునైన డైలాగ్స్‌ చెప్పడం, దుష్టశక్తులను అంతమొందించే ధీరోదాత్తుని క్యారెక్టర్‌ చెయ్యడం అతనికి కష్టమేమీ కాదు. అయితే ఈ సినిమాలో చందు అలియాస్‌ చంద్రశేఖర్‌గా, చంద్రశేఖర్‌ అలియాస్‌ ‘డిక్టేటర్‌’గా రెండు వేరియేషన్స్‌ వున్న క్యారెక్టర్‌లో బాలకృష్ణ పూర్తి న్యాయం చేశాడు. అతను చేసే డాన్సుల్లో వేగం పెరిగింది. ఫైట్స్‌ పంచ్‌లలో పవర్‌ పెరిగింది. డైలాగ్‌ మాడ్యులేషన్‌ రేంజ్‌ పెరిగింది. బాలయ్య చెప్పిన డైలాగ్స్‌ ఆడియన్స్‌ చేత చప్పట్లు కొట్టించాయి. ఈ సినిమా లో కూడా అతని నట విశ్వరూపం చూపించాడు.హీరోయిన్‌గా అంజలి ఒక ప్రాధాన్యత గల క్యారెక్టర్‌ చేసింది. సెకండాఫ్‌లో ఎంటర్‌ అయ్యే ఆమె క్యారెక్టర్‌కి ఓ పర్పస్‌ వుంటుంది. తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంది. ఫస్ట్‌ హాఫ్‌లో తన గ్లామర్‌తో సోనాల్‌ చౌహాన్‌ కనువిందు చేసింది. సెకండాఫ్‌లో మహిమా రాయ్‌గా లేడీ విలన్‌ క్యారెక్టర్‌ లో నాటి హీరోయిన్ రతి అగ్నిహోత్రి పెర్‌ఫార్మెన్స్‌ చాలా డిగ్నిఫైడ్‌గా అనిపిస్తుంది. మిగతా పాత్రల్లో ఫస్ట్‌హాఫ్‌లో కనిపించే విక్రమ్‌జీత్‌ విర్క్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా డీసెంట్‌గా వుంది. నాజర్‌, సుమన్‌, పృథ్వీ, హేమ, రఘుబాబు, అక్ష, వెన్నెల కిషోర్‌, పోసాని, షాయాజీ షిండే.. ఇలా సినిమాలో లెక్కకు మించిన ఆర్టిస్టులు వున్నారు. వారి వారి క్యారెక్టర్ల తమ పెర్‌ఫార్మెన్స్‌తో ఓకే అనిపించారు.

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌:
టెక్నికల్‌ టీమ్‌లో సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె.నాయుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసిన చిన్నా, ఫైట్స్‌ కంపోజ్‌ చేసిన రవివర్మ, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ రాసిన రత్నం, బాలకృష్ణ నుంచి పవర్‌ఫుల్‌ పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకున్న శ్రీవాస్‌ సినిమాకి మెయిన్‌ పిల్లర్స్‌గా నిలిచారు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు శ్యామ్‌ ఫోటోగ్రఫీ రిచ్‌గా కనిపించింది. ప్రతి ఫ్రేమ్‌ని కలర్‌ఫుల్‌గా చిత్రీకరించడంలో అతని పనితనం తెలుస్తుంది. థమన్‌ చేసిన పాటల్లో మూడు పాటలు విజువల్‌గా కూడా ఆకట్టుకున్నాయి. ఎప్పటిలాగే చిన్నా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగా చేశాడు. చాలా సీన్స్‌కి అతని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్ల హైప్‌ వచ్చింది. ఇక ఫైట్స్‌ విషయానికి వస్తే రవివర్మ ప్రతి ఫైట్‌ని డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశాడు. ముఖ్యంగా ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే పబ్‌ ఫైట్‌ని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా కంపోజ్‌ చేశాడు. ఇప్పటివరకు ఎన్నో పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెప్పిన బాలకృష్ణకి ఈసారి రత్నం చాలా కొత్తగా వుండే డైలాగ్స్‌ రాశాడు. కోన వెంకట్‌, గోపీమోహన్‌ స్క్రీన్‌ప్లే గత చిత్రాల్లాగే వున్నప్పటికీ కథలో, డైలాగ్స్‌లో, టేకింగ్‌లో డెప్త్‌ వుండడంతో కొత్తగా అనిపిస్తుంది. సినిమాలోని చాలా సీన్స్‌లో బాలకృష్ణ నుంచి హై రేంజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో శ్రీవాస్‌ సక్సెస్‌ అయ్యాడు.

విశ్లేషణ:
ఒక మర్డర్‌తో స్టార్ట్‌ అయ్యే ఈ సినిమాలో ఆ తర్వాత వచ్చే సీన్స్‌ చాలా సాదా సీదాగా వుంటాయి. సూపర్‌ మార్కెట్‌లో అక్కడక్కడ కామెడీ చెయ్యాలని ట్రై చెయ్యడం, కాలనీ ప్రెసిడెంట్‌గా గెలవాలని హేమ, పృథి పోటీ పడడం, ఎలక్షన్స్‌ పెట్టడం, గెలిచిన తర్వాత ఓ ఐటమ్‌ సాంగ్‌ వేసుకోవడం వంటి సీన్స్‌తో చాలా నార్మల్‌ సినిమాలా అనిపిస్తుంది. అప్పటి వరకు సౌమ్యుడుగా వుంటూ ఎప్పుడూ వివేకానందస్వామి పుస్తకాలు పట్టుకొని తిరిగే చందు తన విశ్వరూపం చూపించడం, 20 మందికి పైగా రౌడీలను మట్టి కరిపించడంతో ఒక్కసారిగా సినిమా గ్రాఫ్‌ పైకి లేస్తుంది. ఆ తర్వాత ఒక అద్భుతమైన ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి చందు ఫ్లాష్‌ బ్యాక్‌ స్టార్ట్‌ చెయ్యడంతో సినిమా మరో యాంగిల్‌కి వెళ్తుంది. సాధారణంగా మనం చూసే ఫ్లాష్‌ బ్యాక్‌ల కంటే ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ లెంగ్త్‌ ఎక్కువ. దీనివల్ల ఫ్లాష్‌బ్యాక్‌కి ముందు జరిగిన కథ ఏమిటి అనేది కష్టపడి గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో కొన్ని సీన్స్‌ కొత్తగా వున్నా, మరికొన్ని సీన్స్‌ చాలా సినిమాల్లో చూసేసినట్టుగా అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఫైట్స్‌గానీ, డైలాగ్స్‌గానీ, సీన్స్‌గానీ రొటీన్‌ అయిపోయాయి అనే భావన కలుగుతుంది. దీంతో సినిమా గ్రాఫ్‌ తగ్గింది. ఫ్లాష్‌బ్యాక్‌ పూర్తయిన తర్వాత సినిమాని కంక్లూడ్‌ చెయ్యాలి కాబట్టి విలన్‌ గ్యాంగ్‌ని మట్టికరిపించి లేడీ విలన్‌ మహిమా రాయ్‌కి వార్నింగ్‌ ఇచ్చి దేశం వదిలి వెళ్ళిపొమ్మని చెప్పడంతో సినిమా ఎండ్‌ అవుతుంది. మాస్‌ ఆడియన్స్‌కి నచ్చే అంశాలకి, అభిమానులు చప్పట్లు కొట్టే డైలాగ్స్‌కి, ఫైట్స్‌కి ఈ సినిమాలో కొదవలేదు. ఇప్పటివరకు బాలకృష్ణ చేసిన సినిమాలకు కాస్త భిన్నంగా వున్న ఈ సినిమా బి సెంటర్స్‌ నుంచి సి సెంటర్స్‌ వరకు ఎంటర్‌టైన్‌ చేసే అవకాశం వుంది. ఇది పండగ సీజన్‌ కావడం వల్ల కలెక్షన్లపరంగా కూడా ఈ సినిమాకి బి , సి ల్లో వర్కవుట్‌ అయ్యే అవకాశాలు వున్నాయి.

తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close