త్వరపడండి! రు.806కే విమాన ప్రయాణం!

హైదరాబాద్: విమానయాన సంస్థల మధ్య పోటీ ప్రయాణీకులకు కలిసొస్తోంది. ఇండియాలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మకర సంక్రాంతి సందర్భంగా ఒక ఆఫర్‌ను ప్రకటించింది. 2016 ఫిబ్రవరి 3 నుంచి 2016 ఏప్రిల్ 12 వరకు దేశంలోపల ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటే వారికి రు. 806కే టికెట్ అమ్ముతున్నారు. ఈ అడ్వాన్స్ బుకింగ్ నిన్నే ప్రారంభమయింది. రేపటితో క్లోజ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం! త్వరపడండి.

విమాన ప్రయాణీకులను ఆకట్టుకోవటంకోసం విమానయాన సంస్థలు కొంతకాలంగా తెగ తంటాలు పడుతున్నాయి. స్పైస్ జెట్, గో ఎయిర్, ఎయిర్ ఏషియా వంటి విమానయాన సంస్థలు ఇప్పటికే టికెట్ రేట్లను అతి తక్కువ ధరలకు ఆఫర్ చేశాయి. గో ఎయిర్ అయితే రు.601 లకే టికెట్లను అమ్మింది. నూతన సంవత్సర సందర్భంగా ఇటీవల స్పైస్ జెట్ రు.716కు, ఎయిర్ ఏషియా రు.899కు టికెట్లు అమ్మాయి. విమానయాన చమురు ధరలు పడిపోవటం వలనే విమానయాన సంస్థలు ఇంత తక్కువ రేట్లకు అమ్మగలుగుతున్నాయని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close