కళ్యాణ్ : బాలయ్య తీరు మారాలంటున్న నిజమైన టిడిపి అభిమానులు

నటుడు నందమూరి బాలకృష్ణ, ” కెసిఆర్ తో సినీ పరిశ్రమ సమావేశానికి నన్నెవరూ పిలవలేదు, ఈ సినీ పరిశ్రమ వాళ్లంతా తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కూర్చుని భూములు పంచుకుంటున్నారా” అంటూ చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు నిన్నంతా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే మెగా అభిమానులు నందమూరి అభిమానులు పరస్పరం సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటూ ఉంటే, కాస్త పరిణితి చెందిన నిజమైన టిడిపి అభిమానులు మాత్రం బాలయ్య తీరు మారకపోతే దీర్ఘకాలంలో తెలుగుదేశం పార్టీకి నష్టం కలుగుతుందని విశ్లేషిస్తున్నారు.

గతంలో అసెంబ్లీలో క్షమాపణలు చెప్పేంతవరకు తీసుకెళ్లిన బాలకృష్ణ వ్యాఖ్యలు:

బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడుతూ అమ్మాయిలు కనిపిస్తే కడుపు చేయాలి అంటూ ఒక సినీ వేడుకలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై అసెంబ్లీలో సైతం చర్చ జరిగితే బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ తరహా నోటి దురద వ్యాఖ్యలు పలుమార్లు ప్రజలకు బాలకృష్ణ మీద, ఆయన కుటుంబానికి చెందిన టిడిపి పార్టీ మీద ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పరుస్తున్నాయి. మహిళలను ఉద్దేశించి చేసిన ఇలాంటి వ్యాఖ్యలే కాకుండా, ” అమితాబచ్చన్ ఏం పీకాడు” అంటూ వ్యాఖ్యలు చేయడం, నరేంద్ర మోడీని “మాద**” అంటూ టిడిపి సమావేశంలో ఇచ్చిన ఉపన్యాసంలో దుర్భాషలాడటం, రోడ్డు మీద జర్నలిస్టుల ని వీధి రౌడీ లాగా పరిగెత్తించి కొట్టడం ఇలాంటి వ్యవహారాలు సామాన్య ప్రజల్లో బాలకృష్ణని, టిడిపిని చులకన చేశాయి. నిన్న వ్యాఖ్యలు చేసిన సమయంలో సైతం మీడియా ఛానల్స్ ఆయన వ్యాఖ్యలను బీప్ చేయవలసి వచ్చిందంటే, ఎమ్మెల్యేగా కూడా ఉన్న బాలకృష్ణ తన నోటిని ఎంతగా అదుపులో పెట్టుకోవలసి ఉందో అర్థమవుతోంది.

ఒక సామాజిక వర్గం టిడిపికి దూరం కావడానికి బాలయ్య కారణమవుతున్నాడా:

రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఒక సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి దూరం కావడానికి బాలయ్య తీరు కారణమవుతోందని పరిణితి చెందిన టిడిపి అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ సామాజిక వర్గానికి ఏడాదికి వెయ్యి కోట్ల చొప్పున కార్పొరేషన్ నిధులు అందించినా, ఓవరాల్ గా చూసుకున్నా చంద్రబాబు పాలన మరి అంత తీసికట్టుగా లేకపోయినా, ఆ సామాజిక వర్గ మనోభావాలు గాయపరిచేలా పలుమార్లు బాలకృష్ణ వంటి వారు ప్రవర్తించడం తో, చంద్రబాబు కి అధికారం రానీయ కూడదు అనే ఉద్దేశంతోనే ఆ సామాజిక వర్గం గంపగుత్తగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిందని వారు అంటున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2014లో ఏ ప్రతిఫలం ఆశించకుండా టిడిపికి సపోర్ట్ చేసినా, ఇరు పార్టీల మధ్య సంబంధాలు బాగా ఉన్న సమయంలోనే ” పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు” అంటూ బాలకృష్ణ పరుషం గా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో మెగా అభిమానుల లోను, ఆ సామాజిక వర్గం చెందిన వారిలోనూ అసహనాన్ని కలగజేశాయి. అదేవిధంగా ” ఎవరెవరో సంకరజాతి వాళ్ళు పార్టీ లు పెడుతున్నారు” అంటూ చేసిన పరోక్ష వ్యాఖ్యలపై అప్పట్లో సోషల్ మీడియాలో యుద్ధమే నడిచింది. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలు సమయంలో చిరంజీవి ని పిలిచారా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ” ఎవరిని పడితే వారిని నేను నెత్తికెక్కించుకోను” అంటూ అహంకారంగా మాట్లాడిన వ్యాఖ్యలు సైతం ఆ సామాజికవర్గానికి చెందిన వారిలో చర్చకు దారితీశాయి. బాలకృష్ణ చేసిన ఇటువంటి వ్యాఖ్యలు చినుకు చినుకు తోడైనట్లుగా ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వేయకూడదు అని కొన్ని వర్గాల వారు తీర్మానించుకునేలా చేశాయి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అన్ని వర్గాలను కలుపుకుని పోవాల్సిన అవసరం టిడిపికి ఉంది:

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటే టిడిపి భవిష్యత్తులో అధికారంలోకి రాకపోవచ్చు. నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ తో తన ” స్వీట్ మెమోరీస్” గుర్తు చేసుకుంటూ ట్వీట్ పెట్టిన కాసేపట్లోనే బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత సోషల్ మీడియాలో – చిరంజీవి ని ఉద్దేశించే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు గా ప్రొజెక్ట్ కావడం చర్చకు దారి తీసింది.

ఇటు రాజకీయాల్లోనే కాకుండా అటు సినీ పరిశ్రమలో కూడా బాలకృష్ణ అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా “మేం వేరు, మా బ్రీడ్ వేరు” అన్నట్లుగా ప్రవర్తిస్తే ఏకాకిలాగా మిగిలి పోవలసి వస్తుంది. కనీసం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అయినా బాలకృష్ణ తన తీరు మార్చుకోవాలని నిజమైన తెలుగుదేశం పార్టీ అభిమానులు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close