అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ జగన్ పై విమర్శలు చేశారు. ఆ విమర్శలు వైసీపీకి నచ్చలేదు. పార్టీ ఆఫీసు నుంచి ఖండించాలని సమాచారం రాగానే అందరూ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోవడ ప్రారంభించారు. బాలకృష్ణ అన్న దానికి ఈ వైసీపీ నేతలు అనేదే ఎక్కువైపోయిది. పదే పదే బాలకృష్ణ అన్న మాటను గుర్తు చేసి రెచ్చిపోయారు. బాలకృష్ణ ఫ్యాన్స్ ఇలా విమర్శించిన వారందరికీ .. జగన్ హయాంలో జరిగిన వ్యవహారాలను గుర్తు చేస్తూ పోయారు. సోషల్ మీడియా అంతా ఇదే.
జగన్ ను బాలకృష్ణ విమర్శించిన పదం.. మొదటి సారి ఆయనే అనలేదు. పాలనలో ఉన్నప్పుడు ప్రజలంతా అనుకున్నారు. సొంత కుటుబంసభ్యులు అనుకున్నారు. సొంతబాబాయ్ ను హత్య చేస్తే అధికారం చేతిలో పెట్టుకుని ఆ నిందను చెల్లి మీద వేయాలని చూసిన వ్యక్తిని ఏమంటారు?. తల్లిపై దారుణమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయించిన వ్యక్తిని ఏమంటారు?. ఆస్తి కోసం తన కోసం పని చేసిన చెల్లిని రోడ్డున పడేసి.. వ్యక్తిత్వంపై నిందలేసిన వారిని ఏమంటారు?. రఘురామకృష్ణరాజును కొట్టిచ్చి లైవ్ లో చూసిన వాళ్లనేమంటారు?. ఇవన్నీ మచ్చుకు కొన్ని. జెత్వానీ దగ్గర నుంచి సొంత పార్టీ నేతల వరకూ అందరికీ జగన్ రెడ్డి చేసిన నిర్వాకాల గురించి స్పష్టత ఉంది. ఆయనను అందరూ అదే పేరుతో మనసులో తిట్టుకోని వారు ఉండరు. బయట కూడా తిట్టని వారు చాలా తక్కువ మంది.
ఇతరుల చావుల్ని కోరుకునేవారికి అంత కంటే పెద్ద బిరుదు ఉండదు. ఇప్పుడే బాలకృష్ణ కొత్తగా అనలేదు. అసెంబ్లీలో అలా వ్యాఖ్యానించడం వల్ల రికార్డులకు ఎక్కి ఉంటుందని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. అందుకే ఆ మాటను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించాలని అంటున్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఉందంటే అది చిరంజీవి గురించి చేసిన వాటి గురించే తప్ప.. జగన్ ను ఉద్దేశించి చేసిన వాటి గురించి కాదని అందరి అభిప్రాయం. ఊరికే వైసీపీ నేతలు ఆ వివాదాన్ని పెద్దది చేసి జగన్ చేసిన పనులన్నింటినీ మళ్లీ గుర్తు చేస్తున్నారు.