బాలయ్య ‘రామానుజాచార్య‌’కి ద‌ర్శ‌కుడెవ‌రు?

బాల‌కృష్ణ ఖాతాలో మ‌రో సినిమా చేరింది. అదే `రామానుజాచార్య‌`. బాల‌య్య‌తో ఈ సినిమా చేస్తాన‌ని ఇటీవ‌ల సి.క‌ల్యాణ్ ప్ర‌కటించారు. ఈసినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ ఇది.

సి.క‌ల్యాణ్ ఇటీవ‌ల బాల‌కృష్ణ‌ని క‌లిశారు. ‘మీతో ఓ సినిమా చేయాలి..’ అని అడిగారు. దానికి బాల‌య్య కూడా `స‌రే` అన్నారు. అప్ప‌టి నుంచీ…బాలయ్య కోసం ఓక‌థ వెదుతున్నారు. ఆమ‌ధ్య ర‌చ‌యిత భార‌వితో సి.క‌ల్యాణ్ భేటీ వేస్తే… ‘రామానుజాచార్య‌’ క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇలాంటి సినిమాలు చేయ‌డానికి బాల‌య్య కూడా ఆస‌క్తి చూపిస్తారు కాబ‌ట్టి, ఈ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌ని సి.క‌ల్యాణ్ భావించారు. దాంతో… బాల‌య్య కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ క‌థ‌పై క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకి కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఎందుకంటే… ఈ కాలంలో.. ఇలాంటి క‌థ‌ని మెప్పించే ద‌ర్శ‌కుడు ఆయ‌నొక్క‌డే. భార‌వితో ఆయ‌న‌ది సుదీర్ఘ ప్ర‌యాణం. ఇద్ద‌రిదీ హిట్ కాంబినేష‌న్‌. కాబ‌ట్టి.. ఈ ప్రాజెక్టు రాఘ‌వేంద్ర‌రావే డీల్ చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం రాఘ‌వేంద్ర రావుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

బాల‌కృష్ణ – రాఘ‌వేంద్ర‌రావు కాంబోలో.. ‘పాండు రంగ‌డు’ వ‌చ్చింది. కానీ అది ఫ్లాప్‌. ఆ సినిమా అప్ప‌ట్లోనే చాలా ట్రోలింగ్ కి గురైంది. అందుకే.. ఈసారి ‘రామానుజాచార్య‌’ని జాగ్ర‌త్త‌గా చేయాల్సి ఉంటుంది. కథ పూర్తిగా సిద్ధ‌మ‌య్యాక‌.. బాల‌య్య – రాఘ‌వేంద్ర‌రావు ల మ‌ధ్య చ‌ర్చ‌లు మొద‌ల‌వుతాయి. ఆ త‌ర‌వాత‌.. ఈ సినిమాని ఎప్పుడు? ఎలా ప‌ట్టాలెక్కించాల‌న్న విష‌యంపై ఓ నిర్ణ‌యానికి వ‌స్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close