పావు గంట స్పీచు.. వాళ్ల గురించే – వెల్ డ‌న్ సుకుమార్‌…

సినిమా అంటే 24 విభాగాల స‌మ‌ష్టి కృషి. తెర ముందు క‌నిపించేది కొంత‌మందే. వెనుక అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించేది ఎంత‌మందో. సినిమా హిట్ట‌యినా, ఫ్లాప‌యినా.. వాళ్ల గురించి మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోరు. క్రెడిట్ అంతా త‌మ ఖాతాలో వేసుకుంటారు త‌ప్ప – సెట్లో చెమ‌టోడ్చిన వాళ్ల‌ని ప్ర‌స్తావించ‌రు. కానీ సుకుమార్ మాత్రం ఈ ప‌ని చేశాడు. పుష్ప విజ‌యోత్స‌వ స‌భ‌… తిరుప‌తిలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సుకుమార్ దాదాపు పావుగంట మాట్లాడాడు. ఈ స్సీచులో బ‌న్నీ గురించో, దేవి శ్రీ ప్ర‌సాద్ గురించో, త‌న గురించో, నిర్మాత‌ల గురించో కాదు. కేవ‌లం త‌న టీమ్ గురించి. త‌న స‌హాయ ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌ల బృందం గురించి. వేదిక‌పై దాదాపు 15 మందిని తోడ్కుని వ‌చ్చిన సుకుమార్ – పేరు పేరునా.. ఒకొక్క‌రి గురించీ, వాళ్ల ప్ర‌తిభ గురించీ.. స‌వివ‌రంగా వివ‌రించి, త‌నకు వాళ్లెంత బ‌లాన్ని ఇచ్చారో పూస గుచ్చిన‌ట్టు చెప్పాడు. ఓ వైపు అభిమానులు `బ‌న్నీ బ‌న్నీ` అంటూ అరుస్తున్నా స‌రే.. `నా టీమ్ గురించి నేను చెప్ప‌క‌పోతే ఎవ‌రు చెబుతారు? వాళ్లే నా బ‌లం.. వాళ్లు లేక‌పోతే నేను లేను` అంటూ… పేరు పేరునా.. ఒకొక్క‌రినీ ప్ర‌స్తావిస్తూ వాళ్ల గురించి అన‌ర్గ‌ళంగా మాట్లాడాడు. త‌న‌కు వాళ్లెంత చేశారో చెప్పుకొచ్చాడు. స‌హాయ ద‌ర్శ‌కుల‌కు సుకుమార్ ఇచ్చే విలువ వేరని.. ఇండ్ర‌స్ట్రీలో అంతా చెప్పుకుంటూ ఉంటారు. అదెలా ఉంటుందో.. ఈరోజు ఈ స్టేజీపై తెలిసొచ్చింది. నిజంగా ఈ విష‌యంలో సుకుమార్ ని అభినందించి తీరాల్సిందే. వెల్ డ‌న్ సుకుమార్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్లీనా..?

ఈవీవీ మంచి ద‌ర్శ‌కుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా ప‌తాకంపై ఆయ‌న కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో ప‌డి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈవీవీకి... త‌న సొంత బ్యాన‌రే మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఈవీవీ...

బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన......

“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

లెక్కల్లేవ్ ..అయినా ఏపీని అలా వదిలేశారేంటి !?

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close