బాల‌య్య – వినాయ‌క్‌… సినిమా ఉంద‌ట‌!

‘రూల‌ర్‌’ కంటే ముందు బాల‌కృష్ణ – వినాయ‌క్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కాల్సింది. వినాయ‌క్ కూడా బాల‌య్య‌కు కొ్ని క‌థ‌లు వినిపించాడు. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ స్థానంలోనే సి.క‌ల్యాణ్‌.. కె.ఎస్ ర‌వికుమార్‌తో ‘రూల‌ర్‌’ ప‌ట్టాలెక్కించాడు. వినాయ‌క్ కూడా ఆ సినిమాపై ఆశ‌లు వదులుకున్న త‌ర‌వాతే… న‌టుడిగా కెమెరా ముందుకు రావాల‌ని ఫిక్స‌య్యాడు. అయితే ఈ కాంబినేష‌న్‌లో సినిమా త‌ప్ప‌కుండా ఉంద‌ట‌. వినాయ‌క్ బాల‌య్య కోసం ఓ క‌ధ సిద్ధం చేయ‌నున్నార‌ని, ఆ సినిమాకి తానే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని సి.క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు.

బాల‌య్య కోసం వినాయ‌క్ చాలా క‌థ‌లు సిద్ధం చేశార‌ని, అయితే అవేం పెద్ద‌గా కిక్ ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆ సినిమా ముందుకు వెళ్ల‌లేద‌ని, ఈసారి వినాయ‌క్ బాల‌య్య కోసం ‘చెన్న‌కేశ‌వ‌రెడ్డి’ కంటే శ‌క్తివంత‌మైన సినిమా చేయాల‌ని భావిస్తున్నాడ‌ని, అలాంటి క‌థ త్వ‌ర‌లోనే రానుంద‌ని, ఆ చిత్రానికి తానే నిర్మాత అని సి.క‌ల్యాణ్ చెప్పారు. బాల‌య్య‌తో సి.క‌ల్యాణ్ కి ‘రూల‌ర్‌’ మూడో సినిమా. అయితే బాల‌య్య‌తో సినిమాలు చేస్తూనే ఉంటాన‌ని, ఈ ప్ర‌యాణం ఆగ‌దని చెప్పుకొచ్చారు క‌ల్యాణ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com