చొరబాటుదారులందరికీ పౌరసత్వం..! ముస్లింలకు తప్ప..!

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అత్యంత వివాదాస్పదమైన బిల్లును.. ఆమోదించడానికి రంగం సిద్దం చేసుకుంది. ఇది పూర్తిగా ఓటు బ్యాంక్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న చట్టంగా తీవ్ర విమర్శల పాలవుతోంది. అదే పౌరసత్వ సవరణ బిల్లు. దీన్ని సోమవారమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్న పట్టుదలతో కేంద్రం ఉంది. దీన్ని విపక్ష పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కారణం… పౌరసత్వ సవరణ బిల్లులో ప్రధానాంశం… చొరబాటుదారులకు దేశ పౌరసత్వం ఇవ్వడం. అందరికీ.. ఇస్తే.. పార్టీలేవీ.. పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేసేవి కావేమో కానీ… ఒక్క ముస్లింలకు తప్ప.. అందరికీ పౌరసత్వం ఇచ్చేలా బిల్లులో నిబంధనలు పొందు పరిచారు.

బెంగాల్ తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో వాటికి సరిహద్దు ఉన్న పొరుగు దేశాల నుంచి పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారు.. కొన్ని రాష్ట్రాల్లో మెజార్టీలుగా మారారు. వీరిని గుర్తించేందుకు జాతీయ పౌరసత్వ రిజిస్టర్ ను తీసుకొచ్చిన కేంద్రం.. ఆ జాబితాలో చోటు దక్కని వారికి అధికారికంగా పౌరసత్వం ఇవ్వనుంది. అయితే.. ఈ అవకాశాన్ని ముస్లింలకు మాత్రం ఇవ్వడం లేదు. పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీలుకు ఈ బిల్లు ద్వారా పౌరసత్వం ఇస్తారు.

అయితే మతప్రాతిపదిక పౌరసత్వాన్ని కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, సీపీఎం సహా విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు.. కేంద్రం పాల్పడుతోందని.. ఆయా పార్టీలు మండి పడుతున్నాయి. ఇస్తే అందరికీ ఇవ్వాలి.. లేకపోతే ఎవరికీ ఇవ్వవద్దన్న విధానాన్ని.. అన్ని రాజకీయ పార్టీలు అవలంభిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు కేంద్రం.. అనుకున్నది చేసేస్తోంది.. ఇతర పార్టీల అభిప్రాయాలను పట్టించుకునే పరిస్థితి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close