మళ్లీ..మళ్లీ అత్యాచారాలు..! ఎన్‌కౌంటర్‌ భయం ఏది..?

అత్యాచారాలకు పాల్పడిన వారిని తక్షణం ఎన్‌కౌంటర్ చేసి పారేస్తే… మరోసారి అలాంటి నేరాలు చేయడానికి భయపడతారంటూ…వచ్చిన విశ్లేషణలు.. తేలిపోతున్నాయి. దిశపై హత్యాచారానికి పాల్పడిన మృగాళ్లు నలుగురిని ఎన్‌కౌంటర్ చేసేసినా.. ఆ ఎన్‌కౌంటర్ రచ్చ ఇంకా జరుగుతున్నా.. అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా.. అత్యాచారాల కేసులు, ఆగడాలపై.. చర్చ జరుగుతున్నా… మృగాళ్ల తీరులో మార్పు రాలేదు. తిరుపతిలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ పధ్నాలుగేళ్ల బాలికను..లిఫ్ట్ ఇస్తామని చెప్పి.. తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వీరిలో ఒకరు రౌడీషీటర్.

తిరుపతి పద్మావతిపురం సర్కిల్‌ వద్ద పద్నాలుగేళ్ల మైనర్‌ బాలిక తిరుచానూరుకు వెళ్లేందుకు అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు చిత్తూరు వెంకటేశ్‌ను లిఫ్ట్‌ అడిగింది. ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వెళ్తూ అతని స్నేహితుడూ, రౌడీషీటర్‌ అయిన రాజానాయక్‌కు సమాచారం ఇచ్చాడు. తిరుచానూరులో వాహనాన్ని ఆపకుండా సమీపంలోని ముండ్లపూడిలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి బాలికను తీసుకెళ్లారు. అక్కడ వారిద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

ఇది మాత్రమే కాదు.. విజయవాడలోనూ ఓ చిన్నారిపై అత్యాచారం ఘటన వెలుగు చూసింది. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లోనూ.. ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే.. దిశ కేసు మీడియా దృష్టిని ఆకర్షించింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అందుకే.. ఆ కేసులో.. నిందితుల్ని.. ఉన్న పళంగా ఎన్ కౌంటర్ చేసేసి.. న్యాయం చేశామనిపించారు. వాళ్లను అలా చంపేస్తే.. ఇతర చోట్ల నేరాలు చేసే వారికి భయం వస్తుందన్న అభిప్రాయాలు అంతటా వినిపించాయి. కానీ.. అలాంటిదేమీ ఉండదని.. తరచూ వెలుగు చూస్తున్న అత్యాచర ఘటనలు నిరూపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

బ్రహ్మానందం ట్రాజెడీ

బ్ర‌హ్మానందం అంటేనే.. ఆనందం. ఆనందం అంటేనే బ్ర‌హ్మానందం. హాస్య పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బ్ర‌హ్మీ. త‌న కామెడీ ట్రాక్ తోనే సినిమా హిట్ట‌యిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే ఇప్పుడు బ్ర‌హ్మానందం జోరు త‌గ్గింది....

HOT NEWS

[X] Close
[X] Close