రైతుల కోసం పవన్ పాదయాత్ర..!?

ఓట్ల కోసం చాలా మంది పాదయాత్రలు చేశారు కానీ… ఇప్పుడు రైతుల కోసం పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించారు. లోతుగా విశ్లేషణ చేసి రైతు సమస్యలపై పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన ప్రకటించారు. మండపేటలో జనసేన తరపున రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల పొట్టకొడితే ప్రభుత్వం కూలిపోతుందని పవన్ హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు రైతుల రక్తం కూడు తింటున్నారనిమండిపడ్డారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే.. ఈ నెల 12న కాకినాడలో నిరాహార దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్‌ ప్రకటించారు. ముద్దులు పెట్టి కౌగిలించుకుంటే రైతుల కడుపులు నిండవని, ఓట్ల కోసం డబ్బులు ఇస్తారు కానీ.. రైతు కన్నీళ్లు తుడిచే ప్రభుత్వాలు లేవని మండిపడ్డారు.

ఉభయగోదావరి జిల్లాలో రైతులను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. మిల్లర్ల నుంచి బియ్యం సేకరిస్తున్న ప్రభుత్వం వారికి తగిన చెల్లింపులు చేయడం లేదు. అలా అడిగిన వారిపై.. విజిలెన్స్ సోదాలు చేయిస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ పర్యటన… రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. చాలా రోజులుగా రైతులకు బాకీ ఉన్న సొమ్ములను ప్రభుత్వం నిన్నటి వరకూ విడుదల చేయలేదు. పవన్ పర్యటనకు ఒక్క రోజు ముందు.. ధాన్యం సేకరణ నిధులు రూ. ఎనభై కోట్లను వారి ఖాతాల్లో వేసింది. ఇంకా పెద్ద ఎత్తున రైతులకు ధాన్యం నగదు చెల్లించాల్సి ఉంది.

పాదయాత్ర చేస్తానని నేరుగా పవన్ కల్యాణ్ ప్రకటించకపోయినప్పటికీ.. ఆయన దృష్టిలో ఆ ప్లాన్ ఉందన్న విషయం మాత్రం అర్థమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి గతంలో అనంతపురం కరువు మీద.. పాదయాత్ర చేస్తానని కూడా పవన్ ప్రకటించారు. అయితే.. కార్యాచరణలోకి రాలేదు. కొద్ది రోజుల కిందట.. ఇసుక సమస్యపై లాంగ్ మార్చ్ చేస్తానన్నారు కానీ.. అభిమానుల తాకిడితో సాధ్యం కాలేదు. దానిపై వైసీపీ నేతలు సెటైర్లు కూడా వేశారు. పాదయాత్ర చేయాలన్న ఉద్దేశం పవన్ కు ఉంటే.. ఇలాంటి సమస్యలు ఏవీ అడ్డంకి కాలేవు. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

బ్రహ్మానందం ట్రాజెడీ

బ్ర‌హ్మానందం అంటేనే.. ఆనందం. ఆనందం అంటేనే బ్ర‌హ్మానందం. హాస్య పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ బ్ర‌హ్మీ. త‌న కామెడీ ట్రాక్ తోనే సినిమా హిట్ట‌యిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయితే ఇప్పుడు బ్ర‌హ్మానందం జోరు త‌గ్గింది....

HOT NEWS

[X] Close
[X] Close