హరీష్‌కు కౌంటర్ : ఆ 4వేల కోట్లు జేబులో వేసుకోబోమన్న బాలినేని..!

రూ. నాలుగు వేల కోట్ల కోసం ఆశపడి రైతుల పంప్ సెట్లకు జగన్మోహన్ రెడ్డి మీటర్లు పెడుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై నాలుగు రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు స్పందించడం ప్రారంభించారు. విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. కాస్త వినయంగానే హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఇస్తున్న రూ. నాలుగు వేల కోట్లు తమ జేబుల్లో వేసుకోబోమని… రాష్ట్రాభివృద్ధికే ఖర్చు పెడతామని చెప్పుకొచ్చారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కోసం.. కేంద్రానికి మద్దతిస్తున్నామన్నారు. ఆ నాలుగు వేల కోట్ల ప్రజల కోసం వినియోగిస్తామన్నారు.

అదే సమయంలో.. టీఆర్ఎస్ రాజకీయ విధానంపైనా బాలినేని విమర్శలు చేశారు. కేంద్రంతో టీఆర్ఎస్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని.. తాము మాత్రం అభివృద్ధి కోసం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని ప్రకటించేశారు. రాష్ట్ర అభివృద్ధికోసం దీర్ఘకాలిక సఖ్యత అవసరమని బాలినేని అంటున్నారు. తమపై విమర్శలు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నట్లుగా బాలినేని.. హరీష్ రావుకు తన మాటల ద్వారా సందేశం పంపారు. అయితే హరీష్ రావు మాత్రం.. రైతులకు తాము ఎంత మేలు చేశామో .. చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు.

పంప్ సెట్లకు మీటర్లు పెడితే.. రైతులు ఆగమైపోతారని.. ఏపీలో రైతుల పరిస్థితి అదే అని.. అలా కాకుండా ఉండాలంటే.. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్‌కే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఆయన పదే పదే ఏపీలో రైతుల్ని అక్కడి ప్రభుత్వం ముంచేసిందని చెబుతూండటంతో.. వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కేవలం రూ. నాలుగు వేల కోట్ల కోసం.. కోటి మంది రైతుల్ని ఇబ్బంది పెట్టడం సమంజసమేనా.. అన్న చర్చ హరీష్ రావు వ్యాఖ్యలతో ఊపందుకుంటోంది. నిజానికి టీఆర్ఎస్, వైసీపీ రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే దుబ్బాక ఉపఎన్నికల బాధ్యత తీసుకున్న హరీష్ రావుకు.. రైతుల ఓట్లు పొందడానికి ఏపీ నిర్ణయమే.. పెద్ద ఆయుధంగా కనిపిస్తోంది.దాన్నే ఉపయోగించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాప్ ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్న మెగా అల్లుడు

`విజేత‌`తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు క‌ల్యాణ్ దేవ్‌. రెండో సినిమా `సూప‌ర్ మ‌చ్చీ`. ఇది సెట్‌లో ఉండ‌గానే.. రెండు మూడు సినిమాలు సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా...

ఇన్‌సైడ్ టాక్‌: ‘ఉప్పెన’ పాట ‘వెర్ష‌న్‌’ల గోల‌

ఓ పాట‌కు ఒక‌డ్రెండు వెర్ష‌న్లు రాయించుకోవ‌డం ఇది వ‌ర‌కు ఉండేది. ఒకే ట్యూన్ ఇద్ద‌రు ముగ్గురికి ఇచ్చి, ఎవరి అవుట్ పుట్ బాగుంటే.. వాళ్ల పాట ఓకే చేయ‌డం జ‌రిగేది. అయితే.. ఇప్పుడు...

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

HOT NEWS

[X] Close
[X] Close