బళ్లారి ఎస్పీ నిద్రమాత్రలు మింగేశాడు. కుటుంబసభ్యులు గుర్తించి ఆయనను సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో బయటపడ్డారు. ఆయన పేరు పవన్ నజ్జూరు . మంచి పనితీరు చూపిస్తారని పేరు ఉంది. పోలీసు పతకాలు కూడా పొందారు. అలాంటి ఎస్పీ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందంటే.. గాలి జనార్ధన్ రెడ్డి వర్గీయులు, ఎమ్మెల్యేలు భరత్ రెడ్డి వర్గీయులు చేసుకున్న ఫ్యాక్షన్ గొడవల వల్ల.
పవన్ నజ్జూరు డిసెంబర్ నెలాఖరు రోజునే బళ్లారికి ఎస్పీకి వచ్చారు. డిసెంబర్31న బాధ్యతలు తీసుకున్నారు. జనవరి ఒకటిన ఆయన రిలాక్స్ అయ్యారో.. లేకపోతే బళ్లారి గురించి స్టడీ చేయాలనుకున్నారో లేకపోతే కింది స్థాయి సిబ్బంది సమాచారం ఇవ్వలేదో కానీ గాలి వర్గీయులు, ఎమ్మెల్యేల వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించలేదు. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత ఎస్పీ పవన్ ఘటనా ప్రాంతానికి వెళ్లారు. దీంతో ఎస్పీ అక్కడే ఉన్నా కాల్పుల్ని నిరోధించలేకపోయారని ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
మంచి పనితీరు రికార్డు ఉన్న తనను బదిలీపై వచ్చిన ఒక్క రోజులో సస్పెండ్ చేయడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. మరో వైపు ఆయనను సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని విమర్శించేవారు పెరిగిపోయారు. అందరూ జాలి చూపిస్తూండటంతో మరింతగా కుంగిపోయిన ఎస్పీ నిద్రమాత్రలు మింగేశారు ప్రస్తుతం బళ్లారిలో 144 సెక్షన్ అమలు చేసి.. గొడవల్ని సద్దుమణిగేలా చేశారు. వాల్మికీ విగ్రహావిష్కరణ చేపట్టే అవకాశం లేకుండా పోయింది.
