పాకిస్తాన్ లో వేర్పాటు వాద ఉద్యమం చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ ప్రాంతంపై పట్టు సాధించుకున్నట్లుగా ప్రకటించింది. ఆర్మీని తరిమేశామని..బలూచ్ పై పూర్తి పట్టు సాధించామని ప్రకటించుకుంది. క్వెట్టా నగరం ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీ చేతుల్లోనే ఉంది. అక్కడికి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన వారు ఎవరూ వెళ్లలేకపోతున్నారు. సైన్యం కూడా ఎప్పుడో ఖాళీ చేసింది. ఇటీవల ప్రతీ రోజూ ఇరవై మంది వరకూ సైనికుల్ని చంపుతూ వచ్చారు. ఇప్పుడు భారత్ తో ఉద్రిక్తతలు పెంచుకుని ఆ దిశగా సైన్యాన్ని మోహరించడం, బలూచిస్తాన్ పై దృష్టి తగ్గించడంతో బీఎల్ఏ వేర్పాటు వాదులు తమ పని తాము పూర్తి చేసుకున్నారు.
బలూచిస్తాన్ లో చైనాకు చాలా పెట్టుబడులు ఉన్నాయి. ఉగ్రవాదులతో పెట్టుకుంటే తమకు తీవ్ర నష్టం జరుగుతుందని వారితో ఓ ఒప్పందానికి చైనా వచ్చినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఎంత ఒత్తిడి చేసినా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జోలికి రావడం కానీ లేకపోతే వారిపై దాడులకు పాకిస్తాన్ సైన్యానికి సాయం. చేయడం కానీ చేయబోమని ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చైనా సరిహద్దుల్లో ఉండే బలూచిస్తాన్ లో.. పాకిస్తాన్.. చైనా సహకారం లేకుండా వేర్పాటు వాదుల్ని కట్టడి చేసే అవకాశం లేదు.
పాకిస్తాన్ లోని క్వెట్టా నగరం బలూచిస్తాన్ పరిధిలో ఉంటుంది. అక్కడ సహజవనరులు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని విచ్చలవిడిగా అమ్ముకుంటున్న పాకిస్తాన్ ప్రభుత్వం.. అక్కడి ప్రజలపై మాత్రం దురాగతాలకు పాల్పడుతోంది. దీంతో చాలా కాలం నుంచి అక్కడి ప్రజలు ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు. ఇవాళ్టికి వారు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. వారు మరింత బలోపేతం అయితే.. అధికారికంగా బలూచిస్తాన్ ఏర్పాటును ప్రకటించాల్సి రావొచ్చు.