కొనసాగుతున్న బంద్, ప్రభావం స్వల్పం

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచినా బంద్ కొనసాగించాలని వామపక్షాలు నిర్ణయించాయి. ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోమాత్రమే జీతాలు పెంచిందని, రాష్ట్రవ్యాప్తంగా పెంచాలని డిమాండ్ చేశాయి. ఇప్పటికే కొందరు కార్మికులు విధులలో చేరిఉండగా సమ్మెలో ఎంతమంది కొనసాగుతారో తెలియకుండా ఉంది. ఆ పర్యవసానమో, ఏమోకానీ హైదరాబాద్‌ నగరంలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించటంలేదు. ఆర్టీసీ బస్సులు యధావిధిగానే నడుస్తున్నాయి. పెట్రోల్ బంకులుకూడా పనిచేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ పార్టీల గ్రేటర్ నాయకులుమాత్రం కార్మికులకు మద్దతుగా జోరుగా ధర్నాలు చేస్తున్నారు. వీరిని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశుధ్య కార్మికులకు ఊహించనివిధంగా జీతాలు పెంచారని, కార్మికులుకూడా దానిపై సంతోషంగా ఉంటే కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఓవరాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ జాత‌కం ఈ ముగ్గురు హీరోల చేతుల్లోనే!

ఈ యేడాది తెలుగు చిత్ర‌సీమది ఎగుడు దిగుడుల ప్ర‌యాణ‌మే. ఓ హిట్ వ‌స్తే... వ‌రుస‌గా ఓ డ‌జ‌ను ఫ్లాపులు ముసురుకుంటున్నాయి. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన సినిమాలు బోల్తా ప‌డుతున్నాయి. వేస‌వి సీజ‌న్‌ని చిత్ర‌సీమ...

పేదల పేరుతో హైడ్రాకు బ్రేకులు – పెద్ద స్కెచ్చే !

హైడ్రా కూల్చివేతల్ని పేదల పేరుతో అడ్డుకోవడంలో కొంత మంది సక్సెస్ అయ్యారు. హైడ్రా యాక్షన్ ప్రారంభించినప్పటి నుండి కొంత మందికి ఉక్కపోత ప్రారంభమయింది. అదే అదనుగా పేదల ఇళ్లు ఇంటూ...

రాజ్యసభలో ఎన్డీఏకు మెజార్టీ

రాజ్యసభలో ఎన్డీఏకు సాధారణ మెజార్టీ వచ్చింది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏకు 119 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో స్వయంగా బీజేపీకి 96...

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడే తీర్పు..ఆ ముగ్గురిలో టెన్షన్

బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close