పీవీ, ఎన్టీఆర్‌లకు కాషాయం పూసేసిన బండి సంజయ్..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పొలిటికల్‌గా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల మొత్తం షెడ్యూల్ కేవలం రెండు వారాలు. అయినా సరే.. కానీ టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతున్నట్లుగా బండి సంజయ్ ప్రచార బ్యాటింగ్ చేస్తున్నారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని పక్కగా ఉపయోగించుకుంటున్నారు. నామినేషన్ల పర్వమప్పుడు.. వరద సాయం ఆపడానికి బండి సంజయే కారణం అంటూ తన పేరుతో టీఆర్ఎస్ సృష్టించిన ఓ ఫేక్ లెటర్‌తో ఆయన కంగారు పడలేదు. దాన్నే అస్త్రంగా చేసుకుని పార్టీని పాతబస్తీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత కూడా ఆయన దూకుడు ఎక్కడా తగ్గడం లేదు. నిర్మోహమాటంగా తాను హిందూత్వ వాదినేనని చెప్పుకుంటూ.. మజ్లిస్‌పై డైరక్ట్ ఎటాక్ చేస్తున్నారు.

పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. టీఆర్ఎస్ ఈ ట్రాప్‌లో పడింది. దీన్ని వివాదాస్పదం చేయాలనుకున్నారు కానీ.. అది మరో విధంగా హైలెట్ అయింది. ఈ సారి అక్బరుద్దీన్.. బండి సంజయ్ కు చాన్సిచ్చారు. అనాలోచితంగా పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల కూల్చివేత గురించి మాట్లాడారు. ఇక బండి సంజయ్ ఊరుకుంటారా..? నిజానికి ఆ ఇద్దరూ బీజేపీతో సంబంధం లేని వాళ్లే. అలా అని బండి సంజయ్ రిజర్వేషన్లు పెట్టుకోలేదు… రంగంలోకి దిగేశారు. ఇద్దరికీ.. కాషాయం పులిమేసి.. మహానుభావులుగా వాడకం ప్రారంభించేశారు. ఓన్ చేసుకున్నారు. ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి పాలన చేశారని కూల్చుతారా?.. అయోధ్య అంశంపై పీవీ స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని కూల్చుతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్లకు నివాళులర్పిస్తానని.. మహానాయకుల ఘాట్లకు రక్షణగా ఉంటానని ప్రమాణం చేయబోతున్నారు. అటు టీడీపీ ఫ్యాన్స్‌ని ఇటు పీవీకి మద్దతుగా ఉండే కాంగ్రెస్ ఫ్యాన్స్‌ని బండి సంజయ్ ఏక కాలంలో ఆకట్టుకుంటున్నారు. సాధారణంగా తమ పార్టీకి చెందని వారిని ఇతర పార్టీలు ఓన్ చేసుకోవు. కానీ బీజేపీ స్టైల్ వేరు. సర్దార్ పటేల్ ను బీజేపీ.. ఓన్ చేసుకున్న విధానం చూసి.. బహుశా.. ఆయన బీజేపీ నేత అయి ఉండవచ్చని అనుకునే జనం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు.. బండి సంజయ్ పీవీ, ఎన్టీఆర్ విషయంలో అలాంటి వ్యూహమే పాటిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీంకోర్టు చెప్పినా ఏపీ సర్కార్‌ది ధిక్కరణేనా..!?

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం ఎవరి మాటా వినాలనుకోవడం లేదు. హైకోర్టుపై నమ్మకం ఉందని.. ఏం చెప్పినా పాటిస్తామని మాటిచ్చి కూడా.. హైకోర్టు తీర్పును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టులో అనుకూల...

ఆర్కే పలుకు : అన్నపై కోపం ఉంటే తెలంగాణలో పార్టీ పెడతారా..!?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఒక వారం గ్యాప్ తీసుకుని... "హిలేరియస్ టాపిక్‌"తో కొత్తపలుకులు వినిపించారు. అన్న జగన్మోహన్ రెడ్డితో తీవ్రంగా విబేధిస్తున్న షర్మిల కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఇంత వరకూ...

నిజామాబాద్ ఎంపీకి పసుపు గండం..!

నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితపై గెలుపొందిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌కు అప్పుడే సెగ ప్రారంభమయింది. ఎంపీ అరవింద్ గెలవడానికి ప్రధాన కారణం పసుపు బోర్డు. నిజామాబాద్‌లోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో పసుపు రైతులు...

చంపడానికి కూడా సిద్ధమంటున్న ఉద్యోగ సంఘాల రెడ్డి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల నేతల "సామాజిక" భక్తి, విధేయత చంపుతాం అనే హెచ్చరికల వరకూ వెళ్తోంది. గత మూడు రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఉద్యోగ సంఘ నేతలు.. అదే పనిగా మీడియా...

HOT NEWS

[X] Close
[X] Close