పుష్ష‌లో 9మంది విల‌న్లు

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `పుష్ష‌`. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఈ సినిమాలో ఒక్క‌డే విల‌న్ అని, ఆ విల‌న్ పాత్ర ఎవ‌రికి ద‌క్కిందో స్ప‌ష్ట‌త లేద‌ని అనుకున్నారు. నిజానికి పుష్ష‌లో 9మంది విల‌న్లున్నార‌ని టాక్‌. అందులో సునీల్‌కీ ఓ పాత్ర ద‌క్కింద‌ట‌. ముఖేష్‌రుషి, రావు ర‌మేష్‌.. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ లో చూసిన కొంత‌మంది విల‌న్లు.. పుష్ష విల‌న్ గ్యాంగ్ లో క‌నిపించ‌నున్నార‌ని, అయితే.. మెయిన్ విల‌న్ ఒక‌డుంటాడ‌ని, ఆయ‌న పేరు ఇంకా ఖ‌రారుచేయ‌లేద‌ని స‌మాచారం.

సునీల్ ఈమ‌ధ్య నెగిటీవ్ క్యారెక్ట‌ర్ల వైపు మొగ్గు చూపిస్తున్నాడు. `డిస్కోరాజా`లో నెగిటీవ్ ట‌చ్ ఉన్న పాత్ర పోషించాడు. అయితే అది త‌న‌కు పెద్ద‌గా ప్ల‌స్ కాలేదు. `క‌ల‌ర్ ఫొటో`లోనూ సునీల్ విల‌న్ గా క‌నిపించాడు. అది కాస్త‌పేరు తీసుకొచ్చింది. సుకుమార్ సినిమాలోనూ సునీల్ ది డిఫ‌రెంట్ త‌ర‌హాలో సాగే విల‌నిజ‌మ‌ని స‌మాచారం. మొత్తానికి పుష్ష‌రాజ్ ఎనిమిదిమంది విల‌న్ల‌తో ఢీ కొట్ట‌బోతున్నాడ‌న్న‌మాట‌. సుకుమార్‌… యాక్ష‌న్ స‌రంజామా కోసం బాగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close