కేంద్ర మంత్రి బండి సంజయ్ తన నియోజకవర్గంలోని టెన్త్ క్లాస్ పిల్లలందరికీ సైకిళ్లు పంచుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పదో తరగతి పిల్లలు ప్రతి ఒక్కరికీ ఒక్కో సైకిల్ ఇస్తున్నారు. బుధవారం నుంచే పంపిణీ చేస్తున్నారు. ఒక్కరికీ మిస్ కాకుండా అందరికీ ఇవ్వాలని డిసైడయ్యారు. ఇందు కోసం చాలా ముందుగానే కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి తెప్పించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మోదీ కానుక పేరుతో వీటిని పంపిణి చేస్తున్నారు.
బండి సంజయ్ కు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చాలా మందికి డౌట్ వస్తుంది. అయితే వాటిని కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ ఫండింగ్ ద్వారా సేకరించారు. అలా సేకరించి తన పుట్టిన రోజునాడు మోదీ కానుక పేరుతో ఇవ్వొచ్చా లేదా అన్నది ఎవరికీ తెలియదు..కానీ బండి సంజయ్ ఇస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ తన పుట్టిన రోజు నాడు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల్లో గత ఏడాదిన్నరలో పిల్లలను కన్న వారికి నాలుగు వేల మందికి కేసీఆర్ కిట్లు అందిస్తున్నారు. ఇది మూడు నాలుగువేల రూపాయలు ఉంటుంది. కానీ బండి సంజయ్ పంచే సైకిల్ విలువ కనీసం ఏడెనిమిది వేలు ఉంటుంది.
గతంలోనూ బండి సంజయ్ తన పుట్టిన రోజు నాడు.. ఆస్పత్రులకు మెడికల్ ఎక్విప్ మెంట్స్… అంబులెన్స్ లు వంటి వాటిని విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు సైకిళ్లు ఇస్తున్నారు. రెండు రోజుల కిందట..తన కుమారుడు మంచి షర్టు వేసుకున్నా బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేస్తారని బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు ఇన్ని సైకిళ్లు ఇస్తూంటే.. బీఆర్ఎస్ నేతలు మళ్లీ విమర్శలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.