బండి సంజయ్ దూకుడుకు బ్రేకులు పడ్డాయా..?

గ్రేటర్ హైదరాబాద్‌లో హంగామా చేస్తున్న బండి సంజయ్ దూకుడు హైకమాండ్ బ్రేకులు వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ చలాన్లు కట్టుకుంటామని హామీ జాతీయ స్థాయిలో వైరల్ అయింది. నిబంధనలు ఉల్లంఘించినా తప్పేమీలేదన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతున్నాయి. బీజేపీకి యువత మద్దతిస్తున్నారని.. వారికి ఫైన్లు వేస్తున్నారని కవరింగ్ చేసుకునే ప్రయత్నాలు కూడా తేలిపోయాయి. అదే సమయంలో.. బాగ్యలక్ష్మి ఆలయ సందర్శన వ్యవహారం కూడా.. విమర్శలకు గురి చేసింది. ప్రశాంతమైన హైదరాబాద్‌లో మత కల్లోలాలు రేపే ప్రయత్నాలను బీజేపీ చేస్తోందన్న అభిప్రాయం ఇతరుల్లో ఏర్పడే అవకాశం కల్పించారని హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.

దీంతో.. బండి సంజయ్ దూకుడు అంతే ఉంటే.. ఇమేజ్‌కు ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుందని భావించి.. ఆయనను దూకుడు తగ్గమని చెప్పినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ ప్రచార వ్యూహాన్ని కిషన్ రెడ్డికి అప్పగించినట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై ఓ వర్గం మీడియాకు ఢిల్లీ హైకమాండ్ నుంచి లీకులు వచ్చాయి. అయితే.. భారతీయ జనతా పార్టీ ఇలాంటివి పట్టించుకోదు. వివాదాలైనా… ఎన్నికల్లో ఏది లాభం చేకూరుస్తుందో.. అది చేసే నేతలకు ప్రాధాన్యం ఇస్తుంది. బీజేపీలో ఉన్న అంతర్గత విబేధాల వల్లే.. బండి సంజయ్ ను.. కంట్రోల్ చేశారన్న ప్రచారం బయటకు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు తర్వాత బండి సంజయ్ కు అనూహ్యమైన గుర్తింపు వచ్చింది. గ్రేటర్‌లో రెండు రోజుల దూకుడు తర్వాత ఆయన మరింతగా ప్రజల నోళ్లలో నానారు. ఇది సీనియర్లకు నచ్చలేదని చెబుతున్నారు. ప్రధాన నేతగా ఎదుగుతున్నారన్న ఉద్దేశంతో.. హైకమాండ్ వద్ద తమ పలుకుబడి ఉపయోగించి.. కాస్త తగ్గించే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. మొత్తానికి బీజేపీ రాజకీయం అంతర్గతంగా ఏదో ఉందన్నట్లుగా సాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close