బ్రేవ్ బాయ్ సిరాజ్..!

తన కెరీర్ కోసం తండ్రి కలలు కన్నాడు. ఆ తండ్రి కలల్ని నిజం చేసే దిశగా ఆ కుర్రాడు దూసుకెళ్తున్నాడు. కానీ విధి వక్రించింది. ఆ కుర్రాడు ఉన్నత శిఖరాలకు చేరుతున్న ఘట్టం చూడకుండానే ఆ తండ్రి కన్నుమూశాడు. తండ్రిని చూసేందుకు వెనక్కి వస్తే.. తన కోసం తండ్రి కన్న కలలు కల్లలు అయ్యే ప్రమాదం…!. అలా రాకుండా ఉంటే.. తన ఉన్నతి కోసం జీవితం త్యాగం చేసిన తండ్రిని చివరి చూపు కూడా నోచుకోలేకపోవడం. ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఎవరికైనా మానసిక క్షోభే. ప్రస్తుతం టీమిండియాకు ఎంపికై.. ఆస్ట్రేలియాలో ఉన్న హైదరాబాద్ ప్లేయర్ ..పేసర్ సిరాజ్‌ది ఇదే పరిస్థితి.

హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్ కుమారుడైన సిరాజుద్దీన్.. పేస్ బౌలర్‌గా అంచెలంచెలుగా దిగారు. ఆటోడ్రైవర్ తండ్రి .. తన మొత్తం సంపాదన సిరాజ్ కోసమే వెచ్చించారు. మొదట ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సత్తా చూపాడు. తర్వాత ఐపీఎల్‌లో ఆడాడు. ఇప్పుడు టీమిండియాకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లాడు. అయితే సిరాజ్‌ తండ్రి మహ్మద్‌ గౌస్‌ ఉపిరితిత్తుల సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇప్పుడు వెనక్కి వస్తే.. కరోనా నిబంధనలు.. బయోబబుల్ రూల్స్ మళ్లీ టీంలో జాయినయ్యే అవకాశం తగ్గిపోతుంది. అంటే.. టీమిండియా కు ఆడాలనే తండ్రి కల.. చెదిరిపోతుంది. అందుకే తండ్రి కడ చూపు కన్నా.. ఆయన ఆశయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

కెరీర్‌లో అండగా నిలిచిన తండ్రి మృతితో తీవ్ర విషాదంలో మునిగినా.. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మాత్రం జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాడు. క్రికెటర్‌గా రాణించాలనే తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు జట్టుతో పాటు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. సిరాజ్‌ మనో నిబ్బరంతో ఉండాలని, సీరీస్‌లో ఉత్తమ ఆటను ప్రదర్శించాలని సామాజిక మాధ్యమాల్లో అతడికి అండగా నిలుస్తున్నారు. భారత్‌ తరఫున 1 వన్డే, 3 టీ20లు ఆడిన సిరాజ్‌ ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఆసీస్‌ పర్యటనలో అతను టెస్టు సిరీస్‌కు మాత్రమే ఎంపికయ్యాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close