కేసీఆర్ సర్కార్‌ను కూల్చేస్తామని మజ్లిస్ వార్నింగ్..!

తిక్కరేగితే కేసీఆర్ సర్కార్ ను రెండు అంటే రెండు నెలల్లోనే కూల్చేస్తామని కేసీఆర్ దోస్తానా పార్టీ మజ్లిస్ హెచ్చరికలు పంపింది. ఆ పార్టీ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్.. నేరుగానే తమ పార్టీ సందేశాన్ని ప్రగతి భవన్‌కు పంపారు. కేసీఆర్‌ను ఆయన ఏమీ అనలేదు కానీ.. కేటీఆర్‌ను మాత్రం దారుణంగా తిట్టారు. కేటీఆర్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో మాటలు నేర్చుకుంటున్న చిలక అని తేల్చేశారు. మజ్లీస్ పార్టీ చాలా మందిని చూసిందని ఎగతాళి చేశారు. అంత ేకాదు.. మా అధినేత చెప్పినట్టు రాజకీయం చేస్తూంటారని.. తమ ఇంటి గుమస్తాతో సమానమని కూడా విమర్శించారు.

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అసదుద్దీన్‌కు చెప్పే చేశారు కేసీఆర్. నోటిఫికేషన్ విడుదలకు ముందు కూడా ప్రగతి భవన్‌కు అసదుద్దీన్ వెళ్లారు. అభ్యర్థుల ఎంపికలోనూ రెండు పార్టీలూ ఓ అవగాహనకు వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. సిట్టింగ్ స్థానాలతో పాటు టీఆర్ఎస్ బలంగా లేని..మజ్లిస్ పట్టు ఉన్న డివిజన్లలో మాత్రమే ఎంఐఎం పోటీ చేస్తోంది. మిగతా అన్ని చోట్లా.. ఎంఐఎం సహకారం టీఆర్ఎస్‌కు ఉంటుంది. సహజంగానే టీఆర్ఎస్‌కు ఓటు వేయమని ఎంఐఎం సంకేతాలు పంపుతుంది. హిందూ ఓట్లు చీల్చేలా.. మజ్లిస్‌కు అభ్యర్థుల సహకారం టీఆర్ఎస్ ఇప్పటికే ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మజ్లిస్ వైపు నుంచి అంత ఘాటు వ్యాఖ్యలు ఎందుకొచ్చాయన్నది ఆసక్తికరంగా మారింది.

కేటీఆర్ రెండు రోజులుగా మీడియాకు వరుసగా ఇంటర్యూలు ఇస్తున్నారు. అందులో మజ్లిస్‌తో పొత్తు.. అవగాహన అంశాలపై సూటిగా మాట్లాడుతున్నారు. అలాంటి చాన్సే లేదని చెబుతున్నారు. ఇదే మజ్లిస్ నేతలకు కోపం తెప్పించిందేమోనని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్‌తో రాజకీయంగా స్నేహంగా ఉన్నప్పటికీ.. అసెంబ్లీలో అక్బరుద్దీన్… ప్రభుత్వాన్ని నిలదీయడానికి సందేహించరు. రాజకీయం రాజకీయంగానే చేస్తారు. అయితే.. ఇప్పుడు ఎందుకీ ఆవేశం అన్నదే కాస్త కీలకంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌ళ్లీ ఆశ‌లు రేపుతున్న ర‌జ‌నీకాంత్‌

రాజ‌కీయాల విష‌యంలో ర‌జ‌నీకాంత్ స్ట్రాట‌జీ ఏమిటో ఎవ‌రికీ అంతుప‌ట్ట‌దు. `ఆ దేవుడు శాసిస్తే.. నేను పాటిస్తాను` అన్న‌ట్టే సినిమా డైలాగులు చెబుతాడు. లేటైనా లేటెస్టుగా వ‌స్తా - అంటూ ఊరిస్తాడు. కానీ.. అదెప్పుడో...

టీడీపీ సస్పెన్షన్ : జగన్ మూడ్ డిస్టర్బ్ చేసిన డిప్యూటీ స్పీకర్ ..!

రైతుల పంటలకు ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతులు సర్వం కోల్పోయారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో వెల్లడిచింది. ఈ అంశంపై అసెంబ్లీలో అధికారపక్షం అడ్డంగా దొరికిపోయింది. రైతులకు...

నాగ‌శౌర్య టైటిల్‌: ‘లక్ష్య‌’

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. త‌న చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ప్ర‌స్తుతానికి రెండు సినిమాలైతే సెట్స్‌పై ఉన్నాయి. వాటిలో.. సంతోష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. నాగ‌శౌర్య...

ప‌వ‌న్ చుట్టూ తిరుగుతున్న మ‌రో ద‌ర్శ‌కుడు

చేతిలో ఉన్న సినిమాల‌న్నీ ఎప్పుడు పూర్త‌వుతాయో తెలీదు గానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం... వ‌రుస‌గా `మాట‌` ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. అలా.. ప‌వ‌న్ నుంచి ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడికి భ‌రోసా ల‌భించింది. మ‌రో...

HOT NEWS

[X] Close
[X] Close