పవన్‌ని కలిసి జగన్‌పై విమర్శలు చేసిన బండి సంజయ్..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చాలని చూస్తున్నారని.. తెలంగాణ బీజేపీ చీఫ్.. బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమవేశమయ్యారు. తెలంగాణలో జనసేనతో కలిసి కార్యక్రమాలు చేపట్టడంపై సమాలోచనలు జరిపారు. గతంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఉన్నప్పుడు లక్ష్మణ్ కూడా కలిశారు. అయితే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ అయిన తర్వాత లాక్ డౌన్ వివిధ కారణాల రీత్యా కలవలేకపోయారు. సోమవారం అవకాశం దొరకడంతో… పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి కలిశారు. రాజకీయాలపై చర్చించారు. వీరి మధ్య ముఖ్యంగా పోతిరెడ్డి పాడు అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

తాజాగా.. వారు తీసుకుంటున్న నిర్ణయాలు.. అమలు చేస్తున్న విధానాల కారణంగా.. ఇద్దరూ.. విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తున్నరన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణని ఇస్లాం రాజ్యంగా మార్చాలని కేసీఆర్.. ఏపీని క్రైస్తవ రాజ్యంగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. రామమందిరాన్ని రక్షించుకున్నట్లే తిరుపతిని కాపాడుకుంటామని ఆయన ప్రకటించారు. ఇతర మతాల ప్రార్థన మందిరాల జోలికి వెళ్ళే దమ్ము జగన్‌కు ఉందా అని ప్రశ్నించారు. హిందువులు గర్జిస్తే కేసీఆర్, జగన్‌ పారిపోతారని.. తిరుమలను కాపాడుకోవటానికి హిందువులు ముందుకురావాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

టీటీడీ భూముల అమ్మకంపై పవన్ కల్యాణ్ కూడా అగ్రెసివ్‌గా స్పందించారు. కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య.. ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందించాలని కోరారు. వెంటనే రీట్వీట్ చేసిన పవన్.. ఏపీ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా.. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్లు పెట్టారు. తెలంగాణలో జనసేన కార్యక్రమాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఉన్నాయో.. లేవో అన్నట్లుగా ఉన్నాయి. అయితే.. ఏపీలో బీజేపీతో పొత్తులో పవన్ కల్యాణ్ ఉన్నందున.. తెలంగాణలో ఉన్న ఆయన ఫ్యాన్ బేస్ బీజేపీకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో.. అక్కడా నేతలు పరిచయాలు పెంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆహా’ కి క‌లిసొచ్చిన చిన్న సినిమాలు

ఈమ‌ధ్య మ‌ల‌యాళం డ‌బ్బింగుల్ని ఎక్కువ‌గా న‌మ్ముకొంది `ఆహా`. వ‌రుస‌గా మ‌ల‌యాళం డ‌బ్బింగులే వ‌స్తోంటే... `ఆహా`లో డబ్బింగులు మాత్ర‌మే వ‌స్తాయా? అంటూ సెటైర్లు కూడా వేసుకున్నారు సినీ అభిమానులు. కానీ చిన్న సినిమాల్ని కొనే...

నానికి కోసం ఇద్ద‌రు కాదు.. ముగ్గురు హీరోయిన్లు

నాని సినిమా అంటే దాదాపుగా సోలో హీరోయినే ఉంటుంది. ఈమ‌ధ్య హీరోయిన్ల సంఖ్య‌ని రెండుకు పెంచుకుంటూ వ‌చ్చాడు. ఇప్పుడు ముగ్గురు హీరోయిన్ల క‌థ‌ని ఎంచుకున్నాడు. నాని క‌థానాయ‌కుడిగా తెర‌కెక్క‌బోతున్న చిత్రం `శ్యాం సింగ‌రాయ్‌`....

‘న‌ర్త‌న‌శాల‌’పై బాల‌య్య ఆశ‌లు

అప్పుడెప్పుడో మొద‌లెట్టి ఆపేసిన `న‌ర్త‌న శాల‌` ఏటీటీ పుణ్య‌మా అని బ‌య‌ట‌కు రావ‌డం నంద‌మూరి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. సినిమా ఎలా వుంది? టికెట్ ధ‌ర 50 రూపాయ‌లు గిట్టుబాటు అయ్యిందా,...

అమరావతి రైతులపై ఎన్నెన్ని కేసులో..!?

అమరావతి రైతులు కాలు కదిపితే కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం.. కొంత మంది దళిత రైతులపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన వ్యక్తి...

HOT NEWS

[X] Close
[X] Close