హ‌రీష్ శంక‌ర్‌ని అంత మాట అనేశాడేంటి?

బండ్ల గ‌ణేష్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చాడు. ఈమ‌ధ్య రాజ‌కీయాల గురించి తెగ మాట్లాడిన గ‌ణేష్ – ఇప్పుడు సినిమా ట్రాక్ లోకి వ‌చ్చాడు. ఇక్క‌డా కాంట్ర‌వ‌ర్సీ కూత‌లే. ఈమ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో `హ‌రీష్ శంక‌ర్ ని స్ట్ర‌యిట్ సినిమాలు తీసి హిట్ కొట్ట‌మ‌నండి చూద్దాం. నేను ఇండ్ర‌స్ట్రీ వ‌దిలేసి వెళ్లిపోతా` అని ఛాలెంజ్ చేశాడు. హ‌రీష్‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ప‌రిచ‌యం చేసేంది తానేన‌ని, సినిమాలు లేక కిందా మీద ప‌డుతూ డిప్రెష‌న్ కి లోనైతే, అలాంటి వాడ్ని‌పిలిచి, ఛాన్సిచ్చింది నేనేన‌ని… స్టేట్‌మెంట్లు ఇచ్చాడు.

నిజానికి గ‌బ్బ‌ర్ సింగ్‌కి ముందే మిర‌ప‌కాయ్ లాంటి హిట్టు హ‌రీష్ శంక‌ర్ కి ఉంది. అలాంట‌ప్పుడు హ‌రీష్ డిప్రెష‌న్‌లో ఉండ‌డం ఏమిటో? పైగా హ‌రీష్ హిట్స‌న్నీ రీమేకులే అన్న‌ట్టు మాట్లాడ‌డం కూడా క‌రెక్టు కాదు. మిర‌ప‌కాయ్‌, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌…. ఇవేమీ రీమేకులు కాదు. కేవ‌లం గ‌బ్బ‌ర్ సింగ్‌, గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ మాత్ర‌మే రీమేకులు. అలాంట‌ప్పుడు ఈ స్టేట్‌మెంట్ ఎలా ఇవ్వ‌గ‌లిగాడో? అంటే బండ్ల దృష్టిలో మిర‌ప‌కాయ్‌, డీజే, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌.. ఇవేమీ హిట్టు కాదా? వాటిని ఫ్లాప్స్ అంటే… బ‌న్నీ ఫ్యాన్స్‌, ర‌వితేజ అభిమానులు, సాయిధ‌ర‌మ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా?

ఇటీవ‌ల గ‌బ్బ‌ర్ సింగ్ కి ఎనిమిదేళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా హ‌రీష్ ఓ ట్వీట్ చేశాడు. అందులో గ‌బ్బ‌ర్ సింగ్ నిర్మాత అయిన బండ్ల గ‌ణేష్ పేరు ప్ర‌స్తావించ‌లేదు. కావాల‌నే హ‌రీష్ అలా చేశాడో, లేదంటే… మ‌ర్చిపోయాడో తెలీదు గానీ, ఈ వ్య‌వ‌హారం బండ్ల గ‌ణేష్‌ని బాగా హ‌ర్ట్ చేసి ఉంటుంది. అందుకే.. హ‌రీష్ శంక‌ర్‌కి రీమేకులు తీయ‌డం త‌ప్ప‌, స్ట్ర‌యిట్ సినిమా తీసి హిట్టు కొట్ట‌లేడ‌ని ఓ నింద విసిరేశాడు. బండ్ల గ‌ణేష్ తో వ్య‌వ‌హారం ఎప్పుడూ ఇలానే ఉంటుంది. న‌చ్చితే నెత్తిమీద పెట్టుకుంటాడు. లేదంటే ట‌ప్పున కింద ప‌డేస్తాడు. హ‌రీష్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. సాధార‌ణంగా హ‌రీష్‌కి కాస్త తిక్క ఎక్కువ‌. త‌న‌ని కెలికితే.. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఊరుకోడు. మ‌రి గ‌ణేష్ యాక్ష‌న్‌కి.. హ‌రీష్ రియాక్ష‌న్ ఏ రేంజులో ఉంటుందో???

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకలోనూ పచాయతీ ఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత...

హైదరాబాదీ.. కమాన్ లెట్స్ ఓట్..!

చదువుకున్న వాళ్లు ఓటు వేయరా..!? భారత దేశంలో ఎప్పుడు.. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. మెట్రో సిటీలు లేని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎనభై శాతం వరకూ ఉంటుంది. వ్యవసాయదారులు.. చిన్న వ్యాపారులు.. చిరు...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత..!

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డిపై గెలిచిన నోముల నర్సింహయ్య.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల నర్సింహయ్య...

HOT NEWS

[X] Close
[X] Close