బండ్ల గ‌ణేష్‌.. ఇంట్లోవాళ్ల ప‌రిస్థితేంటి?

న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్‌కి క‌రోనా వ‌చ్చింద‌న్న వార్త‌లు టాలీవుడ్ లో క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. బండ్ల‌కు ఏమైంది? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. నిజానికి రెండ్రోజుల క్రితం, కొన్ని ఆరోగ్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రికి వెళ్లాడ‌ట గ‌ణేష్‌. అయితే డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు.. ఎందుకైనా మంచిద‌ని క‌రోనా టెస్టులు చేయించుకుంటే.. పాజిటీవ్ అని తేలింది. గ‌ణేష్‌లో అస‌లు క‌రోనా ల‌క్ష‌ణాలే లేవ‌ని, కానీ పాజిటీవ్ అని తేల‌డంతో గ‌ణేష్ కి షాక్ కి గుర‌య్యాడు. వెంట‌నే కుటుంబ స‌భ్యుల‌కూ కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే, అదృష్ట‌వ‌శాత్తూ నెగిటీవ్ అని తేలింది. ప్ర‌స్తుతం కొంత‌మంది గ‌ణేష్ స్నేహితులు, గ‌ణేష్ వ్య‌క్తిగ‌త సిబ్బంది క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు. వాళ్ల రిజ‌ల్ట్ తేలాల్సివుంది. ప్ర‌స్తుతం త‌న ఇంట్లోనే గ‌ణేష్ డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. పాత్రికేయులు, సినిమా వాళ్లు గ‌ణేష్ కి ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు. అయితే.. పాత్రికేయుల‌కు మాత్రం ఆయ‌న ట‌చ్‌లో లేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేశారా?

'ఆచార్య‌' త‌ర‌వాత‌... 'వేదాళం' రీమేక్ మొద‌లెట్ట‌బోతున్నాడు చిరంజీవి. బహుశా.. 2021 మార్చిలో 'వేదాళం' సెట్స్‌పైకి వెళ్లొచ్చు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే `వేదాళం`...

రాత్రికి రాత్రి పంటల బీమా సొమ్ము చెల్లింపు..!

పంటల బీమా విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది. రైతుల తరపున.. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని హడావుడిగా నిన్న...

కర్ణాటకలోనూ పంచాయతీఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత...

HOT NEWS

[X] Close
[X] Close